OTT Movie: కాలేజీ స్టూడెంట్స్ డేటింగ్.. పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. చివరకు.. రెండేళ్ల తర్వాత తెలుగులోకి..
భారీ బడ్జెట్.. స్టార్స్ లేకుండా రూపొందించిన చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సందర్భాలు కోకొల్లలు. మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు భాషలలో విడుదలైన తక్కువ బడ్జెట్ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా తమిళంలో సూపర్ హిట్ అయ్యింది.

2023లో తమిళంలో విడుదలైన ఒక చిన్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తక్కువ బడ్జెట్.. స్టార్ హీరోహీరోయిన్స్ లేకుండానే రూపొందించిన ఈ చిత్రం థియేటర్లలో అదరగొట్టేసింది. రొమాంటిక్ యూత్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్ రిలీజ్ అయిన ఏడాది తర్వాత ఇప్పుడు బిగ్ స్ర్కీన్ పై సందడి చేయనుంది. అదే దాదా. తమిళంలో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కెవిన్, అపర్ణా దాస్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. అంతేకాదు.. ఈ మూవీకి యూత్ తెగ అట్రాక్ట్ అయ్యారు. ఇక ఇప్పుడు ఈ సినిమా పాపా పేరుతో తెలుగులోకి డబ్ కానుంది. ఈసారి ఓటీటీలో కాకుండా నేరుగా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు మేకర్స్.
కథ విషయానికి వస్తే..
కాలేజీలో చివరి సంవత్సరంలో ఉండే ఇద్దరు స్టూడెంట్స్ మణికందన్ (కెవిన్), సింధు (అపర్ణా దాస్) ఇద్దరు ప్రేమలో ఉంటారు. అదే సమయంలో వచ్చే సీన్స్ యూత్ ను అట్రాక్ట్ చేస్తాయి. కానీ అనుకోకుండా పెళ్లికి ముందే సింధుకు ప్రెగ్నెన్సీ వస్తుంది. దీంతో ఆ ఇద్దరి జీవితాలు ఊహించని మలుపులు తిరుగుతాయి. అబార్షన్ చేయించుకోవాలని మణికందన్ చెప్పినప్పటికీ సింధు వినదు. చివరకు ఇద్దరు కలిసి ఓ ఇళ్లు రెంట్ తీసుకుని భార్యభర్తలుగా జీవిస్తారు. కానీ బాబు జన్మించిన తర్వాత సింధు చెప్పకుండా వెళ్లిపోతుంది. ఆమె కోసం వెతికిన మణికందన్.. చివరకు బాబు బాధ్యత తనే తీసుకుంటాడు. ఆ తర్వాత ఉద్యోగం కోసం ఓ కంపెనీకి వెళ్లడం.. అక్కడ మేనేజర్ గా సింధు ఉండడంతో మణికందన్ జీవితం మళ్లీ ఎలా టర్న్ అయ్యింది ? అసలు సింధు ఎందుకు వెళ్లిపోయింది? చివరకు ఏం జరిగింది అనేది కథ.
ఇవి కూడా చదవండి : Tollywood : 14 ఏళ్లకే ఇండస్ట్రీని రూల్ చేసింది.. 16 ఏళ్లకే జాతీయ అవార్డ్.. 21 ఏళ్ల వయసులోనే ఊహించని మరణం..
Mehreen Pirzadaa: ఎఫ్ 2 మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు ఎలా అయ్యిందో చూడండి..
కాలేజీ సమయంలో ఇద్దరు యువతీయువకులు చేసే తప్పులు, ప్రేమ పేరుతో జీవితాలను ఎలాంటి పరిస్థితులలోకి నెట్టేస్తున్నారు అనే అంశాలను ఈ చిత్రంలో చూపించారు. అల్లరి చిల్లరగా తిరిగే ఓ యువకుడు తండ్రిగా ఎలాంటి బాధ్యతలు తీసుకున్నాడు..? అనేది ఈ సినిమాలో చూపించారు. ప్రతీ సీన్.. హీరోహీరోయిన్స్ యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ సినిమాలో అద్భుతమైన నటనకుగానూ ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ అందుకుంది అపర్ణా .
ఇవి కూడా చదవండి :
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..