Brahmanandam: మరోసారి తాతైన బ్రహ్మానందం.. ఈ సారి మహాలక్ష్మి అడుగుపెట్టిందంటూ..
గౌతమ్-జ్యోత్స్నదంపతులకు మొదటి సంతానంగా కొడుకు పార్థ పుట్టాడు. తాజాగా ఈ దంపతులు పండంటి ఆడబిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారు.
హాస్యబ్రహ్మ, లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ఇంటిలో పండగ వాతావరణం నెలకొంది. ఆయన మరోసారి తాత అయ్యారు. బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ సతీమణి జ్యోత్స్న పండంటి అమ్మాయికి జన్మనిచ్చారు. ఈ విషయాన్ని గౌతమ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. తన కుమారుడు అప్పుడే పుట్టిన చెల్లిని చూస్తున్న ఫొటోను షేర్ చేస్తూ..’అమ్మాయి పుట్టడంతో ఆనందం రెట్టింపు అయ్యింది’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు గౌతమ్. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లక్ష్మీ మంచు, బిందు మాధవి తదితర సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు బ్రహ్మానందం, గౌతమ్ దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు. పాపను దీవిస్తూ లవ్, హార్ట్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు. కాగా గౌతమ్-జ్యోత్స్నలకు మొదటి సంతానంగా కొడుకు పార్థ పుట్టాడు. తాజాగా ఈ దంపతులు కూతురిని తమ ఇంట్లోకి ఆహ్వానించారు.
ఇక బ్రహ్మానందంకి ఇద్దరు కుమారులు కాగా గౌతమ్ హీరోగా కొన్ని సినిమాల్లో నటించాడు. 2004లో పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. అయితే, ఆ తరవాత బ్రహ్మానందం తన కుమారుడిని చదువు నిమిత్తం విదేశాలకు పంపారు. ఉన్నత విద్యను అభ్యసించి తరిగొచ్చిన గౌతమ్.. మళ్లీ సినిమాల్లో నటించాడు. అయితే అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఆయన నటించిన బసంతి, చారుశీల, మను చిత్రాలు మెప్పించలేకపోయాయి. ఇక బ్రహ్మానందం విషయానికి వస్తే.. చివరిగా భీమ్లానాయక్ సినిమాలో కనిపించారు స్వరబ్రహ్మ. ఈ మధ్య ఆయన సెలెక్టివ్‌గా మాత్రమే సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతంఆయన ప్రధాన పాత్రలో నటించిన పంచతంత్రం డిసెంబర్ 9న విడుదలవుతోంది. ఈ సినిమాలో స్వాతి , సముద్ర ఖని, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, నరేష్ అగస్త్య, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్పల ముఖ్యపాత్రలు పోషించారు.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..