Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిన ఎస్‌జే సూర్య
ఇప్పటికే పవన్ వరుస సినిమాలను లైనప్ చేసి రెడీగా ఉన్నారు. ఇక రాజకీయాల్లో పవన్ చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు పవన్. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలతో అటు రాజకీయాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. రాజకీయాల్లో రాణిస్తూనే సమయం దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే పవన్ వరుస సినిమాలను లైనప్ చేసి రెడీగా ఉన్నారు. ఇక రాజకీయాల్లో పవన్ చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు పవన్. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని.. ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండేది లేదని పవన్ తన ప్రసంగాలతో ప్రజలను ఆకర్షిస్తున్నారు. పవన్ సీఎం కావాలని చాలా మంది కోరుకుంటున్నారు. అలాగే అభిమానులు ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. పవన్ వస్తే తప్పకుండా రాజకీయాల్లో మార్పులు వస్తాయని అంటున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు దర్శకుడు, నటుడు ఎస్ జె సూర్య.
పవన్ కళ్యాణ్ స్వచ్ఛమైన మనసు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. అతను నాకు మంచి స్నేహితుడు. ఇద్దరు కలిసి చాలా కాలంగా జర్నీ చేస్తున్నాం. ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు నేను గర్వంగా ఫీలవుతాను` అని అన్నారు. సూర్య వ్యాఖ్యలతో పవన్ అభిమానులు సంబరపడుతున్నారు.
ఇక పవన్ ఎస్ జే సూర్య కాంబినేషన్ లో వచ్చిన ఖుషి సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అలాగే ఈ ఇద్దరి కాంబోలో కొమరం పులి అనే సినిమా కూడా వచ్చింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఇప్పుడు సూర్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు ఎస్ జే సూర్య.