Prabhas: మరో స్టార్ డైరెక్టర్‌కు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..? ఫ్యాన్స్‌కు పండగే
ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలా దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ కు పండగే. ఇప్పటికే ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం డార్లింగ్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వలో సలార్ అనే సినిమా చేస్తున్నారు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిన అవసరం లేదు . బాహుబలి సినిమాతో ప్రభాస్ ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలా దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ కు పండగే. ఇప్పటికే ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం డార్లింగ్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వలో సలార్ అనే సినిమా చేస్తున్నారు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఆదిపురుష్ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. ఇక మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ తో సినిమా చేయడానికి మరో డైరెక్టర్ కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
ఆ దర్శకుడు ఎవరో కాదు.. తమిళ నట స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఈ క్రేజీ డైరెక్టర్ కార్తితో ఖైదీ, విజయ్ మాస్టర్, కమల్ హాసన్‌తో విక్రమ్ తీసి సూపర్ హిట్స్ అందుకున్నాడు. దాంతో లోకేష్ తో సినిమా చేయడానికి హీరోలంతా ఆసక్తి చూపుతున్నారు. ఇటీవలే లోకేష్ రామ్ చరణ్ తో సినిమా చేయనున్నాడని టాక్ వినిపించింది.
ఇక ఇప్పుడు రెబల్ స్టార్ తో ఓ భారీ యాక్షన్ చిత్రానికి ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై ప్రభాస్, లోకేశ్ కనగరాజ్ ఇటీవలే సమావేశమై చర్చించుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.