Jayaprada: జయప్రద ఖాతాలో మరో విశిష్ట పురస్కారం.. ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర అవార్డు
అలనాటి నటి జయప్రద ఖాతాలో మరో విశిష్ట పురస్కారం చేరింది. ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర అవార్డును అందుకున్నారు ఆమె.
గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార మహోత్సవం కన్నుల పండగగా జరిగింది. ఎన్వీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఈ వేడుకలో సినీ రాజకీయ ప్రముఖులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర సెలబ్రేషన్స్ జరిగాయ్. ఆలనాటి నటి జయప్రదకు ఎన్టీఆర్ పురస్కారాన్ని అందజేశారు.
మేళతాళాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య జయప్రదకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పిన నిర్వాహకులు, ఆ తర్వాత ఘనంగా సత్కరించారు. అనంతరం, నందమూరి రామకృష్ణ చేతుల మీదుగా జయప్రదకు ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారాన్ని అందజేశారు. జయప్రదతోపాటు పలువురికి ఎన్టీఆర్ అవార్డులతో సన్మానించారు. డాక్టర్ మైథిలి అబ్బరాజుకి ఎన్టీఆర్ అభిమాన అవార్డ్ అందజేశారు.
ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర ఉత్సవాల్లో సూపర్‌స్టార్ కృష్ణకు ఘననివాళి అర్పించారు. అతిథులు, ప్రజలు అందరూ కలిసి కొన్ని నిమిషాలపాటు మౌనంపాటించి, కృష్ణ చిత్రపటానికి పుష్పాంజలి అర్పించారు. రచయిత సాయిమాధవ్ బుర్రా సభా నిర్వహణలో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార మహోత్సవ సభ జరిగింది. కాగా ఈ నెల 28న ‘అడవి రాముడు‘ మూవీ ప్రదర్శించనున్నారు. జయప్రద, ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ, డైరెక్టర్ ఎ. కోదండరామిరెడ్డి ఆడియెన్స్‌తో కలిసి ఈ సినిమాను వీక్షించనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..