Mahesh Babu : సూపర్ స్టార్ ఎత్తుకున్న ఈ చిన్నారి గుర్తుందా..? ఆ అమ్మడు ఇప్పుడు క్రేజీ హీరోయిన్

మహేష్ తో నటించిన హీరోయిన్స్ చాలా మందిని ఇప్పుడు ఆయన పక్కన ఊహించుకోలేం.. ఇక మహేష్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చేసిన వారు ఇప్పుడు హీరోయిన్స్ గా కూడా మారిపోయారు.

Mahesh Babu : సూపర్ స్టార్ ఎత్తుకున్న ఈ చిన్నారి గుర్తుందా..? ఆ అమ్మడు ఇప్పుడు క్రేజీ హీరోయిన్
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 28, 2022 | 11:22 AM

సూపర్ స్టార్ మహేష్ బాబును చూస్తే వయసు పెరుగుతుందా లేక తగ్గుతుందా..? అనే అనుమానం రాక మానదు. నాలుగు పదుల వయసులోనూ మహేష్ పాతికేళ్ల కుర్రాడిగా కనిపిస్తున్నారు. మహేష్ తో నటించిన హీరోయిన్స్ చాలా మందిని ఇప్పుడు ఆయన పక్కన ఊహించుకోలేం.. ఇక మహేష్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చేసిన వారు ఇప్పుడు హీరోయిన్స్ గా కూడా మారిపోయారు. పైన కనిపిస్తున్న ఫొటోలో చిన్నారి కూడా ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ అయ్యింది. తెలుగులో ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళ్ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంది ఈ చిన్నది. ఇక ఇప్పుడు తెలుగులో మంచి అవకాశం దొరికితే సినిమా చేయాలని చూస్తుంది ఈ బ్యూటీ ఇంతకు మహేష్ చేతిలో ఉన్న ఈ క్యూట్ బేబీని గుర్తుపట్టడం అంత కష్టం కాదు సుమీ..

మహేష్ ఎత్తుకుంటే ఎవరినో చూపిస్తున్న ఈ చిన్న పాపా ఎవరో కాదు.. క్రేజీ హీరోయిన్ శ్రీదివ్య. ఈ అమ్మడు రవిబాబు దర్శకత్వంలో వచ్చిన మనసారా అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత తెలుగులో బస్ స్టాప్ , కేరింత సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ తెలుగమ్మాయి.

అక్కడ విశాల్, కార్తీ, శివకార్తికేయన్‌‌‌లాంటి స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది. ఇక ఈ అమ్మడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలో నటించింది. మహేష్ బాబు నటించిన యువరాజు సినిమాలో శ్రీదివ్య చిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ సినిమాలోని ఫోటో వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటో పై మహేష్ ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.  మహేష్ బాబు సినిమాల్లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇలా హీరోలు, హీరోయిన్లుగా మారిపోతున్నారు.. కానీ ఆయన ఇంకా అలానే ఉన్నారు అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
Sri Divya

Sri Divya