తారక్ సినిమా కోసం కూడా బాలీవుడ్ స్టార్స్ ను ప్రశాంత్ నీల్ రంగంలోకి దింపనున్నాడా

కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాడు ప్రశాంత్ నీల్. రాకింగ్ స్టార్ యశ్ నటించిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యింది.

తారక్ సినిమా కోసం కూడా బాలీవుడ్ స్టార్స్ ను ప్రశాంత్ నీల్ రంగంలోకి దింపనున్నాడా
Rajeev Rayala

|

Jun 18, 2021 | 12:05 PM

కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాడు ప్రశాంత్ నీల్. రాకింగ్ స్టార్ యశ్ నటించిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యింది. విడుదలైన అన్నిభాషల్లో భారీ విజయాన్ని దక్కించుకుంది కేజీఎఫ్. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ ను తెరకెక్కించే పనిలో ఉన్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాలో భారీ స్టార్ కాస్టింగ్ ఉండనుంది. ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్త్ నటిస్తున్నారు. అలాగే రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు ప్రశాంత్. సలార్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ న్యూ లుక్ లో కనిపించనున్నాడు.

ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం తారక్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల తో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ సినిమాను పట్టాలెక్కిన్చానున్నాడు. అయితే ఎన్టీఆర్ సినిమా కోసం కూడా బాలీవుడ్ స్టార్స్ తో పటు కొంతమంది కన్నడ యాక్టర్స్ ను కూడా రంగంలోకి దింపాలని చూస్తున్నాడట ప్రశాంత్. ఈ సినిమాను భారీ రేంజ్ తో తెరేక్కించనున్నాడని టాక్. అయితే ఈసినిమాకుడా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉంటుందా లేక వేరే జోనర్ లో తెరకెక్కిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉండనుందని కొందరు అంటుంటే మరికొంతమంది మాత్రం సైన్స్ ఫిక్షన్ కథతో రూపొందిస్తున్నారని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Aditi Rao Hydari : ఆ సినిమా ఓకే చేయడం నా కెరీర్‌లోనే డేరింగ్ డెసిషన్‌ అంటున్న అదితి..

Salman Khan’s Radhe: సల్మాన్ దెబ్బకి హైబ్రీడ్ రిలీజ్ అన్న కాన్సెప్ట్‌నే పక్కన పెడుతున్న బాలీవుడ్

Venkatesh’s Narappa: జోరు పెంచిన నారప్ప.. ఫస్టుకాపీ రెడీ చేస్తున్న చిత్రయూనిట్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu