Tollywood: ‘15 రోజుల పాటు నా యూరిన్ ను బీరులా తాగా’.. టాలీవుడ్ ప్రముఖ నటుడి షాకింగ్ కామెంట్స్
ఈ ప్రముఖ నటుడు తెలుగుతో పాటు పలు హిందీ సినిమాల్లో నటించాడు. తెలుగులో అయితే మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తదితర స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించాడు. తాజాగా ఈ సీనియర్ నటుడు షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు.

సాధారణంగా మనకు అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు డాక్టర్ల దగ్గరకు వెళతాం. వారు సూచించిన మందులనే వాడతాం. అయితే కొందరు మాత్రం ఇతర పద్ధతులను పాటిస్తుంటారు. నాటు మందు, పసరు మందు అంటూ ఏవేవో తీసుకుంటారు. ఇవి కొన్ని సార్లు తీవ్ర ప్రాణాపాయాన్ని కలిగిస్తాయి. అయినా కొందరు వీటినే ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు పరేష్ రావల్ గతంలో తాను యూరిన్ ను తాగానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకున్న అనారోగ్య సమస్య నుంచి త్వరగా కోలుకునేందుకు ఉదయాన్న ఈ పని చేశానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీంతో ఆయన మాటలు విన్న వారందరూ షాక్ అవుతున్నారు. ‘ఓసారి నేను మోకాలి గాయంతో ముంబైలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరాను. అప్పుడు అజయ్ దేవ్‌గణ్ తండ్రి వీరు దేవ్‌గణ్ ( నన్ను చూసేందుకు వచ్చాడు. ఆయన వచ్చి ఏమైందని అడిగారు. నా మోకాలి గాయం గురించి ఆయనకు వివరించాను. ఆ సమయంలో నా కెరీర్ ముగిసిపోయిందని బాగా బాధపడ్డాను. దీంతో వీరు దేవగణ్ ఒక సలహా ఇచ్చాడు. ఉదయం నిద్ర లేచిన వెంటనే నా యూరిన్ తాగమని చెప్పాడు. అలాగే సిగరెట్లు, మద్యం సేవించకూడదని సూచించారు. మాంసానికి కూడా దూరంగా ఉండాలన్నారు. ఆయన చెప్పిన సలహాలను నేను పాటించాను’
”ఆయన చెప్పిన తర్వాత నేను నా యూరిన్ ను బీరులాగా తాగడం ప్రారంభించాను. సుమారు 15 రోజులు ఇలా చేసాను. చివరకు నా ఎక్స్-రే రిపోర్ట్ వచ్చింది. దానిని చూసి వైద్యుడే ఆశ్చర్యపోయాడు. ఆయన నా మోకాలి సమస్య పరిష్కారమైందన్నాడు. సాధారణంగా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు కోలుకోవడానికి రెండున్నర నెలలు పడుతుంది. అయితే కేవలం 15 రోజుల్లోనే నేను కోలుకున్నాను. వీరు దేవ్‌గణ్ చెప్పిన సలహా వల్ల నెలన్నరకే డిశ్చార్జ్ అయ్యాను. ఆయన సలహా నాకొక మ్యాజిక్‌లా పని చేసింది’ అని పరేష్ రావల్ చెప్పుకొచ్చారు.
పరేష్ రావల్ కామెంట్స్.. వీడియో ఇదిగో..
“I cured myself by drinking my own urine ..”- Former BJP MP Paresh Rawal pic.twitter.com/6cegsT0eqF
— جالب (@Raijalib_) April 28, 2025
బాలీవుడ్ లో స్టార్ నటుడిగావెలుగొందుతోన్న పరేశ్ రావల్ తెలుగులో క్షణక్షణం, రిక్షావోడు, బావగారు బాగున్నారా?, శంకర్‌దాదా ఎంబీబీఎస్, తీన్మార్, ఆకాశమే హద్దుగా తదితర చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా శంకర్ దాదా ఎంబీబీఎస్ లో లింగం మావయ్య పాత్రలో కడుపుబ్బా నవ్వించారు.
(NOTE: ఇది కేవలం ఆ నటుడి అభిప్రాయం మాత్రమే. ఇది TV9 తెలుగు ఇచ్చిన సలహా కాదు. ఇలాంటి ఆరోగ్యపరమైన విషయాల్లో వైద్య నిపుణుల సలహాలు తీసుకోవడమమే ఉత్తమం)
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








