AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ యంగ్ హీరోయిన్ అంటే రాజమౌళికి చాలా ఇష్టమట.. మీరు ఊహించిన నటి మాత్రం కాదు..

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్నారు. మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పై ఇప్పటికే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మునుపెన్నడూ చూడని కథతో జక్కన్న ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.

ఈ యంగ్ హీరోయిన్ అంటే రాజమౌళికి చాలా ఇష్టమట.. మీరు ఊహించిన నటి మాత్రం కాదు..
Rajamouli
Rajeev Rayala
|

Updated on: Apr 28, 2025 | 12:18 PM

Share

దర్శక ధీరుడు రాజమౌళి సినిమా వస్తుందంటే చాలు ఆ సినిమా ముందుగానే బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అవుతారు ప్రేక్షకులు. రాజమౌళి ఏ సినిమా చేసిన అది సంచలన విజయం సాధించడం పక్కా.. ఇప్పటివరకు అపజయం అంటూ ఎరగకుండా దూసుకుపోతున్నారు. ఇక చివరిగా ఆర్ఆర్ఆర్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకోవడమే కాకుండా.. ఆస్కార్ వేదికపై తెలుగు సినిమా నిలబడేలా చేశారు రాజమౌళి. తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. మహేష్ బాబు రాజమౌళి సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ తో జక్కన్న ఎలాంటి సినిమా చేస్తారు అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా అడ్వెంచరల్ డ్రామాగా ఉండనుంది.

ఇదిలా ఉంటే రాజమౌళి తన కథలతోనే కాదు నటీనటుల ఎంపికలోనూ చాలా జాగ్రత్తలు వహిస్తారు. పాత్రకు ప్రాణంపోసే నటులను ఎంచుకుంటూ ఉంటారు. అయితే రాజమౌళికి బాగా నటించిన నటి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర చర్చ జరుగుతుంది. రాజమౌళి ఎంతో మంది అగ్రతారలతో పని చేశారు. సీనియర్ హీరోయిన్స్ దగ్గర నుంచి స్టార్ హీరోయిన్స్ వరకు అందరితో కలిసి పని చేశారు. అయితే ఆయనకు మాత్రం ఓ యంగ్ హీరోయిన్ అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా చెప్పారు.

గతంలో రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సహజంగా తనకు సావిత్రి, సూర్యకాంతం అంటే ఎంతో ఇష్టం అని అన్నారు. ఆ ఇద్దరి తర్వాత తనను అంతగా మెప్పించిన నటి అనీ అని అన్నారు. నాగార్జున హీరోగా నటించిన రాజన్న సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది అనీ. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహించగా.. సినిమాలో యాక్షన్ సీన్స్ కు రాజమౌళి దర్శకత్వం వహించారు. కాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. చైల్డ్ ఆర్టిస్ట్ చిన్నారి అనీ నటనకి తాను ఫిదా అయినట్లు తెలిపారు. అలాగే సినిమాలోని ఓ పెద్ద సీన్ ఉంది. అందులో కళ్ళు తిప్పుకోకుండా నటించడం ఎవరివల్లా కాదు. కానీ అమ్మాయి కళ్ళతోనే ఎమోషనల్స్ పలికించింది అని రాజమౌళి తెలిపారు. అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ అయిన అనీ.. ఇప్పుడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. రాజన్న సినిమా టైం లో ఆమె వయసు కేవలం 10 ఏళ్లు మాత్రమే.. ఇప్పుడు ఈ చిన్నది వెబ్ సిరీస్ లలో నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.