AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: అమ్మాయిలే ఈ స్మైలింగ్ కిల్లర్ టార్గెట్.. ఓటీటీలో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. పిల్లలతో మాత్రం చూడొద్దు

ఓటీటీలు వచ్చిన తర్వాత హారర్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ మూవీస్‌కు క్రేజ్ పెరిగిపోయింది. వీటి స్టోరీ ఒకేలా ఉన్నప్పటికీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, యాక్షన్ సీక్వెన్స్‌లు, ట్విస్టులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అందుకే చాలా మంది ఈ జానర్ సినిమాలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

OTT Movie: అమ్మాయిలే ఈ స్మైలింగ్ కిల్లర్ టార్గెట్.. ఓటీటీలో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. పిల్లలతో మాత్రం చూడొద్దు
OTT Movie
Basha Shek
|

Updated on: Apr 28, 2025 | 11:43 AM

Share

క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే తెలుగుతో పాటు మిగతా భాషల్లో నూ ఇప్పుడు ఇవే జానర్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. మరీ ముఖ్యంగా ఓటీటీలో ఈ రకమైన సినిమాలకే ఎక్కువగా ఆదరణ ఉంటోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కు చెందినదే. ఇది ఒక కోలీవుడ్ సైకో థ్రిల్లర్ మూవీ. గతంలో తమిళంలో వచ్చిన రాక్ష‌స‌న్‌, పోర్ తొళిల్ సినిమాలకు ఏ మాత్రం తీసి పోదు. సినిమా కథ విషయానికి వస్తే.. ఇందులో ఒక సైకో కిల్ల‌ర్ న‌గ‌రంలో అనేక మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి అత్యంత పాశ‌వికంగా హ‌త్య చేసి తప్పించుకు తిరుగు తుంటాడు. అదే సమయంలో ధైర్యం, మొండితనం ఉన్న సిన్సియర్ పోలీసాఫీసర్ అయిన హీరోకు ఈ సైకో కిల్లర్ పట్టుకునే బాధ్యతలు అప్పగిస్తారు. రంగంలోకి దిగిన హీరో ఎట్టకేలకు సైకో కిల్లర్‌ ను పట్టుకుంటాడు. కానీ అనుకోకుండా తన తోట ఉద్యోగులైన స్నేహితుడి ప్రాణాలను కోల్పోతాడు. దీంతో డిప్రెషన్ బారిన పడిన హీరో డిపార్ట్‌మెంట్ నుంచి త‌ప్పుకొంటాడు. తన స్నేహితుడి చెల్లెలిని వివాహం చేసుకుని కాఫీ షాప్ ఓపెన్ చూసుకుంటుంటాడు. అయితే జైలు నుంచి తప్పించుకున్న సైకో కిల్లర్ మునపటి పనుల్నే కొనసాగిస్తాడు.

న‌గ‌రంలో అమ్మాయిల దారుణ హత్యకు గురవుతారు. అయితే ఈసారి సైకో కిల్లర్ ఏకంగా హీరో ఫ్యామిలీనే టార్గెట్ చేస్తాడు. మ‌రి ఆ త‌ర్వాత ఏం జరిగింది?సైకో కిల్ల‌ర్ పట్టుకునేందుకు హీరో ఏం చేశాడు? ఈ క్ర‌మంలో అత‌నికి ఎలాంటి స‌వాళ్లు ఎదురయ్యాయి? అన్నది తెలుసుకోవాలంటే  ఇరైవన్ (తెలుగులో గాడ్) సినిమా చూడాల్సిందే.   ఐ అహ్మ‌ద్ తెరకెక్కించిన ఈ సినిమా 2023లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది.  జయం రవి, నయన తార ప్రధాన పాత్రలు పోషించారు. స్మైలింగ్ కిల్లర్ గా బాలీవుడ్ న‌టుడు రాహుల్ బోస్ న‌టించాడు. స్టోరీ చదువుతుంటేనే చూసేలా అనిపిస్తున్న ఈ సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారం ‘నెట్‌ఫ్లిక్స్’లో అందుబాటులో ఉంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకువారికి గాడ్ సినిమా ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇరైవన్ సినిమాపై ఓ యూజర్ రివ్యూ…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..