AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devara: దేవర కోసం యానిమల్ విలన్.. బాబీ డియోల్ పాత్రతో ఊహించని ట్విస్ట్ ఉండనుందట..

ఆర్ఆర్ఆర్ లాంటి సంచలన విజయం తర్వాత ఎన్టీఆర్ ఎలాంటి పాత్రలో కనిపిస్తారు అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ ఆర్టిస్టుల సంఖ్య పెరుగుతోంది.

Devara: దేవర కోసం యానిమల్ విలన్.. బాబీ డియోల్ పాత్రతో ఊహించని ట్విస్ట్ ఉండనుందట..
Ntr
Rajeev Rayala
|

Updated on: Jul 26, 2024 | 4:32 PM

Share

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ‘దేవర: పార్ట్ 1’ కూడా ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి సంచలన విజయం తర్వాత ఎన్టీఆర్ ఎలాంటి పాత్రలో కనిపిస్తారు అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ ఆర్టిస్టుల సంఖ్య పెరుగుతోంది. ‘దేవర: పార్ట్ 1’ టీమ్ పాన్-ఇండియా స్థాయిలో దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశ్యంతో బి-టౌన్ నుంచి చాలా మందిని దింపుతున్నారు. సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ తర్వాత ఇప్పుడు మరో స్టార్ నటుడి పేరు కూడా లిస్ట్ లోకి చేరింది.

ఇది కూడా చదవండి : Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లోకి అమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఈ స్టార్ హీరో ఎంట్రీ పక్క అంటగా..!

2024లో అత్యధికంగా ఎదురుచూస్తున్న టాప్ 10 భారతీయ చిత్రాల జాబితాలో ‘దేవర: పార్ట్ 1’ చిత్రం మూడవ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అలాగే యానిమల్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన బాబీ డియోల్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారని తెలుస్తోంది.

 ఇదికూడా చదవండి :  Prabhas : సైనికుడిగా రెబల్ స్టార్ ప్రభాస్.. ఆ సీన్స్‌కు థియేటర్స్ దద్దరిల్లాల్సిందేనట..

బాబీ డియోల్ కూడా నటిస్తారనే వార్త వినగానే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ‘దేవర’ సినిమా రెండు భాగాలుగా రూపొందనుంది. మొదటి భాగం చివర్లో బాబీ డియోల్ పాత్ర ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. రెండో భాగంలో ఆయన పాత్ర హైలైట్ అవుతుంది. అతన్ని మెయిన్ విలన్‌గా కనిపించనున్నాడని కొన్ని మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై చిత్ర బృందం అధికారికంగా ప్రకటన ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.  బాబీ డియోల్ కెరీర్ కొన్నాళ్లు డల్ గా ఉంది. అయితే గతేడాది ‘యానిమల్‌’ సినిమాతో ఆయన అదరగొట్టాడు. ఆ సినిమాలో నెగెటివ్ రోల్ అద్భుతంగా నటించాడు. యానిమల్ తర్వాత టాలీవుడ్‌లో ఆయనకు డిమాండ్ పెరిగింది. పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీర మల్లు’, బాలకృష్ణ నటించిన 109వ సినిమాలోనూ బాబీ డియోల్ ఛాన్స్ కొట్టేశాడు. ఇప్పుడు దేవరాలోనూ నటిస్తున్నాడని టాక్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
అది మాత్రమే అసలైన టీ అని ధృవీకరించిన FSSAI!
అది మాత్రమే అసలైన టీ అని ధృవీకరించిన FSSAI!
బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే