ఛత్రపతి నటుడు భార్య గురించి తెలుసా.? ఆమె చాలా ఫేమస్ నటి
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమాలో ఓ చిన్న పాత్ర అయినా చేస్తుంటాడు చంద్ర శేఖర్. ఛత్రపతి సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతర్వాత నుంచి ఆయన పేరు ఛత్రపతి శేఖర్ గా మారిపోయింది. సినిమాల్లోకి రాక ముందు అంతకు ముందు ఆయన పలు సీరియల్స్ లో నటించి మెప్పించాడు. అంతకు ముందు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్.. సింహాద్రి, సై సినిమాల్లో నటించాడు.
టాలీవుడ్ లో చాలా మంది విలన్స్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మంచి పేరు తెచ్చుకున్నారు. వారిలో చంద్ర శేఖర్ ఒకరు. ఎన్నో సినిమాల్లో విలక్షణమైన పాత్రలు చేసి మెప్పించాడు ఈ నటుడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమాలో ఓ చిన్న పాత్ర అయినా చేస్తుంటాడు చంద్ర శేఖర్. ఛత్రపతి సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతర్వాత నుంచి ఆయన పేరు ఛత్రపతి శేఖర్ గా మారిపోయింది. సినిమాల్లోకి రాక ముందు అంతకు ముందు ఆయన పలు సీరియల్స్ లో నటించి మెప్పించాడు. అంతకు ముందు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్.. సింహాద్రి, సై సినిమాల్లో నటించాడు. ఛత్రపతి సినిమా ఆయన మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. చంద్రశేఖర్ ఫ్యామిలి గురించి చాలా మందికి తెలియదు. ఆయన సతీమణి కూడా టాలీవుడ్ కు చెందిన వారే.
ఇది కూడా చదవండి : ఇప్పుడు ఎక్కడా చూసిన ఈ చిన్నదాని వీడియోలే.. ఇంతకూ ఈమె ఎవరంటే
ఆమె కూడా ఓ నటి. చాలా సినిమాల్లో కనిపించి మెప్పించారు. ఆమె పేరు నీల్య భవాని. ఈమె కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి ప్రేక్షకులను అలరించారు. అలాగే పలు సీరియల్స్ లోనూ నటించి మెప్పించారు నీల్య భవాని. ఛత్రపతి శేఖర్, నీల్య భవాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ళు సాఫీగా సాగింది వీరి సంసారం జీవితం. ఆతర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఇప్పుడు విడి విడిగా జీవిస్తున్నారు.
ఇది కూడా చదవండి : Krishna Vamsi: ఆయన్ని అలా చూస్తే నేను తట్టుకోలేను.. కన్నీళ్లు పెట్టుకున్న కృష్ణవంశీ
చాలా మందికి నీల్య భవాని పేరు తెలియదు కానీ ఆమెను చూస్తే గుర్తుపడతారు. పండగ చేస్కో,కిక్ 2 ,సైరా,నాని జెంటిల్ మ్యాన్ లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమె స్వస్థలం ఖమ్మం. నీల్య భవాని సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గ ఉండరు. ఆమె ఫేస్ బుక్ లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నీల్య భవాని ఫేస్ బుక్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి