AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: స్టేజ్‌పై అదరగొట్టేసిన రష్మిక.. చీరకట్టులో రంజితమే పాటకు సూపర్బ్ స్టెప్పులు.. వీడియో ఇదిగో

ప్రస్తుతం నేషనల్ క్రష్‌ గా మన్ననలు అందుకుంటోన్న ఈ ముద్దుగుమ్మ అటు దక్షిణాది సినిమాల్లోనూ, ఇటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ అయినా ఎంతో చలాకీగా, యాక్టివ్ గా ఉంటుంది రష్మిక. తాజాగా కేరళలో జరిగిన ఈవెంట్ కు హాజరైంది. దీంతో అభిమానులు తనను చూసేందుకు భారీగా తరలివచ్చారు.

Rashmika Mandanna: స్టేజ్‌పై అదరగొట్టేసిన రష్మిక.. చీరకట్టులో రంజితమే పాటకు సూపర్బ్ స్టెప్పులు.. వీడియో ఇదిగో
Rashmika Mandanna
Basha Shek
|

Updated on: Jul 26, 2024 | 4:00 PM

Share

పుష్ప ది రైజ్‌ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిపోయింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. ఇక గతేడాది రణ్ బీర్ కపూర్ సరసన ఆమె నటించిన యానిమల్ సినిమా ఏకంగా రూ. 900 కోట్ల వసూళ్లు దాటేసింది. ప్రస్తుతం నేషనల్ క్రష్‌ గా మన్ననలు అందుకుంటోన్న ఈ ముద్దుగుమ్మ అటు దక్షిణాది సినిమాల్లోనూ, ఇటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ అయినా ఎంతో చలాకీగా, యాక్టివ్ గా ఉంటుంది రష్మిక. తాజాగా కేరళలో జరిగిన ఈవెంట్ కు హాజరైంది. దీంతో అభిమానులు తనను చూసేందుకు భారీగా తరలివచ్చారు. ఇదే ఈవెంట్ లో తన దుమ్ము రేపే డ్యాన్స్ తో అదరగొట్టింది రష్మిక. వారసుడు సినిమాలోని రంజితమే పాటకు చీర కట్టులో క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆమె స్టెప్స్ వేస్తుంటే అభిమానులు ఈలలు, కేకలతో హోరెత్తించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు ‘రష్మిక ఎనర్జీ లెవెల్స్ వేరబ్బా’ అంటూ క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు.

కన్నడనాటకు చెందిన రష్మిక మందన్నా మలయాళంలో ఒక్క సినిమా కూడా చేయలేదు. అయినా అక్కడ ఆమెను ఎంతగానో అభిమానించే వారున్నారని ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో పుష్పకు కొనసాగింపుగా వస్తున్న పుష్ప..ది రూల్‌ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన రష్మిక పోస్టర్స్, స్టిల్స్ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. డిసెంబర్6న పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

రష్మిక డ్యాన్స్.. వీడియో..

దీంతో పాటు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తోన్న లేడీ ఓరియంటెడ్ మిస్టరీ థ్రిల్లర్ ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ చిత్రంలోనూ నటిస్తోందీ నేషనల్ క్రష్. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న కుబేర సినిమాలో లీడ్ రోల్ లో కనిపించనుంది. ఇందులో ధనుష్ హీరోగా నటిస్తుండగా, అక్కినేని నాగార్జున మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. దీంతో పాటు మురుగదాస్‌, సల్మాన్ ఖాన్ కాంబినేషన్‌లో రాబోతున్న సికిందర్‌లోనూ రష్మికనే హీరోయిన్ గా నటిస్తోంది.

రష్మిక స్టేజ్ డ్యాన్స్ విజువల్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.