బంపర్ ఆఫర్ కోట్టెసిన బిగ్‏బాస్ బోల్డ్ బ్యూటీ.. మెగా హీరో సినిమాలో ఛాన్స్.. ఎంతకీ ఏ పాత్రంటే..

బిగ్‏బాస్‏లో పక్కింటి అమ్మాయిగా ఎంట్రీ ఇచ్చి... తన ఆట తీరుతో ఆల్ మోస్ట్ టైటిల్ గెలుచుకునే వరకు వచ్చి అరియానా. యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన అరియానా

బంపర్ ఆఫర్ కోట్టెసిన బిగ్‏బాస్ బోల్డ్ బ్యూటీ.. మెగా హీరో సినిమాలో ఛాన్స్.. ఎంతకీ ఏ పాత్రంటే..
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 04, 2021 | 8:10 PM

బిగ్‏బాస్‏లో పక్కింటి అమ్మాయిగా ఎంట్రీ ఇచ్చి… తన ఆట తీరుతో ఆల్ మోస్ట్ టైటిల్ గెలుచుకునే వరకు వచ్చి అరియానా. యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన అరియానా ఈ షోతో స్ట్రాంగ్ కంటెస్టెంట్‏గా గుర్తింపు తెచ్చుకుంది ఈ బోల్డ్ బ్యూటీ. ఇప్పటికే యంగ్ హీరో రాజ్ తరుణ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అమ్మడు మెగా ఆఫర్ కోట్టెసింది.

మెగా హీరో కళ్యాణ్ దేవ్ నటిస్తున్న కొత్త సినిమాలో అరియానా ఆయన చెల్లెలిగా నటించే ఛాన్స్ కోట్టేసింది. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్ సమర్పణలో పీపుల్ మీడియా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సందర్బంగా ‘‘నాకు వచ్చిన ఈ గుర్తింపును, ఫేమ్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇటీవలే నేను షూటింగ్ ప్రారంభించాను. నా రోల్ చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. పెర్ఫార్మెన్స్‌కు ఎంతో స్కోప్ ఉన్న పాత్ర’’ అని అరియానా వెల్లడించారు. 2018లో రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వచ్చిన విజేత సినిమాతో కల్యాణ్‌ దేవ్‌ హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన ‘సూపర్ మాచి’ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా.. అరియానా గ్లోరీకి కూడా అవకాశాలు పెరుగుతున్నాయి. యంగ్ హీరో రాజ్ తరుణ్ సినిమాలోనూ అరియానా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి గతంలో దర్శకుడు శ్రీధర్ సీపాన మాట్లాడుతూ.. ‘‘నమో వెంకటేశ, దూకుడు సహా చాలా సినిమాలకు నేను రచయితగా పనిచేశాను. నేను దర్శకుడిగా పరిచయం అవ్వడానికి ఒక చక్కటి స్క్రిప్ట్ రాసుకున్నాను. సినిమా చాలా బాగా వస్తుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో హీరో పాత్రకు మెగా హీరో కళ్యాణ్ దేవ్ కరెక్ట్ సరిపోతారని నేను బలంగా నమ్ముతున్నాను’’ అని చెప్పుకొచ్చారు.

Also Read:

రాంగ్ రూట్‏లో వచ్చిన ‘మహానటి’ హీరో.. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మందలించిన పోలీస్.. నెట్టింట్లో వీడియో వైరల్..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!