AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాంగ్ రూట్‏లో వచ్చిన ‘మహానటి’ హీరో.. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మందలించిన పోలీస్.. నెట్టింట్లో వీడియో వైరల్..

'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. ఈ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ నేరుగా తెలుగులో

రాంగ్ రూట్‏లో వచ్చిన 'మహానటి' హీరో.. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మందలించిన పోలీస్.. నెట్టింట్లో వీడియో వైరల్..
Rajitha Chanti
|

Updated on: Mar 04, 2021 | 6:03 PM

Share

Dulquer Salmaan: ‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. ఈ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ నేరుగా తెలుగులో హను రాఘవపుడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీనిని మహానటి మూవీ మేకర్స్.. స్వప్న , ప్రియాంక దత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులోనే కాకుండా.. మలయాళ, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ హీరో ఓ లగ్జరీ కారును కొన్నాడు. దానిని తీసుకొని కేరళ రోడ్ల మీద చక్కర్లు కొట్టాడు. ఇదే క్రమంలో ఓ చోట రాంగ్ రూట్‏లో సిగ్నల్ కోసం వేయిట్ చేశాడు. ఇది గమనించిన అక్కడి పోలీస్.. కారు దగ్గరకు వెళ్ళి.. ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని దుల్కర్ సల్మాన్‏కు సూచించారు. దీంతో అతడు తన కారును రివర్స్ చేసుకొని వెళ్ళి రోడ్డుకు కుడివైపు లైన్లోకి వెళ్ళాడు. ఈ ఘటన మొత్తాన్ని అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా… ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.

ఇదిలా ఉండగా.. గతేడాది దుల్కర్ సల్మాన్ నటించిన ‘కన్నుమ్ కన్నుమ్ కొల్లైయాదిత్తాల్’ విడుదలైన సందర్భంగా ఇటీవలే చిత్రయూనిట్ సంబరాలు జరుపుకుంది. ఈ సినిమాకు దేశింగ్ పెరియసామి దర్శకత్వం వహించగా.. రీతూ వర్మ, వీజే రక్షన్, నిరంజని అగత్యాన్ కీలక పాత్రల్లో నటించారు. ఇదే సినిమా ‘కనులు కనులను దోచాయంటే’ అనే పేరుతో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.

Also Read:

ఇంట్రెస్టింగ్‏గా సైనా నెహ్వాల్ బయోపిక్ టీజర్… పరిణితిచోప్రా నటన అదుర్స్.. రిలీజ్ ఎప్పుడంటే..

మరోసారి ‘సారంగదరియా’తో ఫిదా చేసిన సాయిపల్లవి.. హైబ్రిడ్ పిల్ల గురించి మీకు తెలియని విషయాలు..

నాగార్జున, కళ్యాణ్ క్రిష్ణ కాంబో క్రేజీ అప్ డేట్… ‘బంగార్రాజు’ సిక్వేల్ పట్టాలెక్కెది అప్పుడే…

Follow Us
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?