Bigg Boss 6 Telugu: ఎమోషన్స్‌తో నిండిపోయిన బిగ్ బాస్ హౌస్.. కన్నీళ్లు పెట్టించిన సుధీప

బిగ్ బాస్ సీజన్ 6(Bigg Boss 6 )లో నిన్నటి ఎపిసోడ్ చాలా ఎమోషనల్‌గా సాగింది. సిసింద్రీ టాస్క్ తర్వాత హౌస్ లో ఉన్న వారి ;లైఫ్ లో పిల్లల వల్ల ఎలా మారింది.. పిల్లలతో ఎలాంటి బాండింగ్ ఉంటుందో వివరించాలని తెలిపాడు.

Bigg Boss 6 Telugu: ఎమోషన్స్‌తో నిండిపోయిన బిగ్ బాస్ హౌస్.. కన్నీళ్లు పెట్టించిన సుధీప
Bigg Boss 6
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 16, 2022 | 4:14 PM

బిగ్ బాస్ సీజన్ 6(Bigg Boss 6 )లో నిన్నటి ఎపిసోడ్ చాలా ఎమోషనల్‌గా సాగింది. సిసింద్రీ టాస్క్ తర్వాత హౌస్ లో ఉన్న వారి లైఫ్ పిల్లల వల్ల ఎలా మారింది.. పిల్లలతో ఎలాంటి బాండింగ్ ఉంటుందో వివరించాలని బిగ్ బాస్ తెలిపాడు. దాంతో కంటెస్టెంట్స్ ఒకొక్కరు తమ జీవితంలో జరిగిన కన్నీటి గాధలను వివరించారు. కొంతమంది పిల్లలను ఎలా కోల్పోయారో చెప్పి కంటతడి పెట్టించారు. ముఖ్యంగా మెరీనా, రోహిత్ తాము అమ్మానాన్న కాలేకపోయాం అని చెప్పి హౌస్ లో ఉన్న వారితో పాటు ప్రేక్షకులను కూడా ఏడిపించేశారు. ఇక రేవంత్ తన భార్య 7 నెలల గర్భిణీ అని.. చిన్నతనం నుంచి నాన్న అన్న పిలుపుకు నోచుకోలేదని అన్నాడు.. ఎప్పుడెప్పుడు ఆ పిలుపు వింటానా అని ఎదురుచూస్తున్నా అని తెలిపాడు. ఇక సుధీప తన జీవితంలో జరిగిన చేదు అనుభవాన్ని చెప్పి కళ్ళు చెమ్మగిలేలా చేసింది.

తాను తల్లికాబోతున్నా అని తెలిసినప్పుడు అప్పుడే పిలల్లు వద్దు అనుకున్నా.. కానీ అందరు ఒత్తిడి చేసే సరికి.. వచ్చినదాన్ని ఎందుకు వదులుకోవాలి అనుకున్నాను. కానీ కడుపులో బేబీ పెరుగుతున్న సమయంలో తనకు థైరాయిడ్ ఎక్కువ కావడంతో బేబీ చనిపోయిందని తెలిపింది. అదే సమయంలో నా చెల్లెలి పాపను దగ్గరకు తీసుకున్నా.. కానీ నా భర్త అంటూ ఉండేవాడు..అది వాళ్ల పిల్ల ఎప్పుడైనా ఇచ్చేయాలి అని.. చిన్న బొమ్మని మన దగ్గర నుంచి తీసుకుంటే తట్టుకోలేక పోయాం. పాపను ఇస్తున్నప్పుడు ప్రాణం పోయినట్టు అనిపించింది అని చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకుంది సుధీప. ఫ్యూచర్‌లో నేను తల్లిని అవుతానని అనుకుంటున్నా అని ఎమోషనల్ అయ్యింది. మొత్తంగా నిన్నటి ఎపిసోడ్ ఎంతో ఎమోషనల్ గా సాగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..