Nenu Meeku Baga Kavalsina Vadini Review: ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ మూవీ రివ్యూ..
Nenu Meeku Baga Kavalsina Vadini Review: బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తనదైన శైలిలో వరస సినిమాలు చేస్తున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన తాజాగా మరో సినిమాతో వచ్చారు.
Nenu Meeku Baga Kavalsina Vadini Review: బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తనదైన శైలిలో వరస సినిమాలు చేస్తున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన తాజాగా మరో సినిమాతో వచ్చారు. అదే నేను మీకు బాగా కావాల్సిన వాడిని. టైటిల్‌లోనే ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న ఈ సినిమా రివ్యూ ఏంటి.. నిజంగానే కిరణ్ అందరికీ బాగా కావాల్సిన వాడు అనిపించుకున్నాడా లేదా..?
మూవీ: నేను మీకు బాగా కావాల్సినవాడిని
నటీనటులు: కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్, సోనూ ఠాకూర్, సిధ్ధార్ద్ మీనన్, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా భాస్కర్, సమీర్, సంగీత, నిహరిక, ప్రమోదిని, భరత్ రొంగలి తదితరులు
సంగీతం: మణిశర్మ
ఎడిటర్: ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రాఫర్: రాజ్ కే నల్లి
స్క్రీన్ ప్లే, మాటలు: కిరణ్ అబ్బవరం
దర్శకుడు: శ్రీధర్ గాదే
నిర్మాత: కోడి దివ్య దీప్తి
రిలీజ్ డేట్: 16/09/22
కథ:
వివేక్ (కిరణ్ అబ్బవరం) క్యాబ్ డ్రైవర్. ఒకరోజు తన కారులో ఎక్కిన తేజు (సంజన ఆనంద్) బాగా తాగేసి ఉండడంతో.. ఆ అమ్మాయి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అసలు అంతగా ఎందుకు తాగాల్సి వచ్చిందో కారణం అడుగుతాడు. అదే సమయంలో తన ప్రేమకథ వివేక్‌కు చెప్తుంది తేజు. తన అక్క కారణంగా తాను ఒకరి చేతిలో మోసపోయాననే విషయాన్ని చెప్తుంది. ఆ తర్వాత వివేక్ ప్రోత్సాహంతో దూరమైన తన కుటుంబానికి తేజు దగ్గరవుతుంది. అంతా బాగానే ఉంది.. వివేక్‌పై మీద పెరిగిన ఇష్టాన్ని బయటపెట్టాలనుకునే సమయానికి అదిరిపోయే ట్విస్ట్ ఇస్తాడు వివేక్. అతడి పేరు వివేక్ కాదు నవీన్ అని తెలుస్తుంది. ఈ మార్పు ఎందుకు.. తేజు కోసం క్యాబ్ డ్రైవర్‌గా ఎందుకు మారాడు.. అసలు ఈ ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటి అనేది మిగిలిన కథ..
కథనం:
కిరణ్ అబ్బవరం ముందు నుంచి కూడా తన సినిమాలకు చాలా రొటీన్ కథలనే ఎంచుకుంటున్నాడు. పైగా తను కొత్త కథలేం చేయట్లేదని ముందుగానే ఆడియన్స్‌ను సిద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. మరోసారి రొటీన్ కథతోనే వచ్చేసాడు ఈ హీరో. ఎప్పట్నుంచో వాడుతున్న పాత కథనే తీసుకొచ్చి.. దానికి కొత్తగా హంగులు అద్దడానికి ప్రయత్నించారు. కమర్షియల్ పంథాకు బాగా అలవాటు పడిపోయి.. ఆరు పాటలు, నాలుగు ఫైట్లతోనే సినిమాలు నింపేద్దామని ఫిక్స్ అయిపోయాడు కిరణ్. ఎస్ ఆర్ కళ్యాణమండపం వర్కవుట్ అయిందని.. దీన్ని కూడా అలాగే మొదలుపెట్టాడు. సినిమా మొదలవ్వడమే ఐటం సాంగ్‌తోనే వస్తుంది.. ఆ వెంటనే హీరోయిన్ ఎంట్రీ.. యాక్షన్ సీక్వెన్స్.. నాలుగు కామెడీ సీన్స్.. ప్రేమలో పడిపోవడం.. అక్కడే ఓ ట్విస్ట్.. ఇంటర్వెల్.. ఇలా ఓ పక్కా ఫార్మాట్‌లోనే వెళ్లిపోతుంది కథ. పైగా స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగుతుంది. కారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ కోసం చాలా సమయం తీసుకున్నాడు దర్శకుడు శ్రీధర్ గాదే. హీరోయిన్‌ను మద్యానికి బానిసైన అమ్మాయిగా పరిచయం చేయడం.. హీరో ఆమెను చూసి ఆమె బాధేంటో కనుక్కుని.. దాన్ని బాగు చేయాలనుకోవడంతోనే ఫస్టాఫ్ అంతా అయిపోతుంది. ఫస్ట్ అఫ్ అయ్యే వరకు సినిమా కథేంటో పూర్తిగా ఐడియా రాదు. ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంది. ప్రేమలో మోసపోయి.. తల్లిదండ్రులకు దూరమయ్యానని బాధతో తాగుతున్న హీరోయిన్‌ను బాగు చేసి.. మళ్లీ వాళ్ళ కుటుంబానికి హీరో చేరువ చేసాడు అనేది సింపుల్‌గా చెప్పాలంటే ఈ చిత్ర కథ. ఫస్టాఫ్ సోసోగానే లాగించిన దర్శకుడు.. సెకండ్ హాఫ్‌లోకి మరో ఆసక్తికరమైన ట్విస్టు ఇచ్చాడు. ఎవరు ఊహించని విధంగా హీరోయిన్ లవ్ స్టోరీని డిజైన్ చేసిన దర్శకుడు.. అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ కూడా రాసుకున్నాడు. లైన్ పరంగా బాగానే అనిపించినా.. దాన్ని తీసిన విధానంలో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు దర్శకుడు శ్రీధర్. పైగా చివర్లో సినిమా చూసాక.. 15 ఏళ్ళ కృష్ణవంశీ చేసిన శశిరేఖా పరిణయం గుర్తుకొస్తుంది.
నటీనటులు:
కిరణ్ అబ్బవరంలో ఈజ్ బాగానే ఉంది. కమర్షియల్ హీరో లక్షణాలన్నీ ఉన్నాయి కానీ సరైన ఎమోషన్స్ మాత్రం లేవు. కథ కంటే ఎక్కువగా ఎలివేషన్స్ నమ్ముకుంటున్నాడు ఈ కుర్రాడు. హీరోయిన్ సంజన ఆనంద్ బాగుంది. పాత్ర పరిధి మేర బాగానే నటించింది. బాబా భాస్కర్ కామెడీ అతిగా అనిపిస్తుంది. తమిళ యాస ఎక్కువగా వినిపిస్తుంది. ఎస్వీ కృష్ణారెడ్డి, సోనూ ఠాకూర్, సమీర్ తదితరులు ఉన్నంత వరకు బాగానే మెప్పించారు.
టెక్నికల్ టీం:
మణిశర్మ సంగీతం రొటీన్‌గా ఉంది. పాటల్లో కొత్తదనం కనిపించలేదు. ఆర్ఆర్ రాజ్ కే నల్లి సినిమాటోగ్రఫీ పర్లేదు. విజువల్‌గా బాగానే అనిపిస్తుంది ఈ చిత్రం. ఎడిటింగ్ చాలా వీక్. ఫస్టాఫ్‌లో చాలా సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ కూడా మైనస్. దర్శకుడిగా శ్రీధర్ గాదే ప్రాజెక్ట్‌లో సగం నుంచి వచ్చాడు కాబట్టి ఆయన్ని పూర్తిగా బ్లేమ్ చేయలేం. ఇద్దరు దర్శకుల ప్రాడక్ట్ కాబట్టి ఆ కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. రొటీన్ కథకు తోడు స్క్రీన్ ప్లే కూడా అంతే రొటీన్‌గా ఉండటంతో కావాల్సినవాడు ఎవరికీ కాకుండా పోయాడు.
పంచ్ లైన్: నేను మీకు బాగా కావాల్సినవాడిని.. అంత కావాల్సిన వాడేమీ కాదు..!
మరిన్ని సినిమా రివ్యూలు ఇక్కడ చదవండి..