Project k: ఊహకందని కాన్సెప్ట్‌తో ప్రభాస్, నాగ అశ్విన్ మూవీ.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే తొలిసారిగా..
Project k: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎప్పుడెప్పునా అని ఎదురు చూస్తున్న సినిమాల్లో ప్రాజెక్ట్ కే ఒకటి. మహానటి ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ కూడా ఖరారు చేయకముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి...
Project k: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎప్పుడెప్పునా అని ఎదురు చూస్తున్న సినిమాల్లో ప్రాజెక్ట్ కే ఒకటి. మహానటి ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ కూడా ఖరారు చేయకముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో ప్రభాస్‌కు జోడిగా దీపికా పదుకొణె (Deepika padukone) నటిస్తుండగా, ముఖ్య పాత్రలో అమితాబ్ బచ్చన్ (Amitavh Bachchan) నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే కొంతమేర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు మూవీ నుంచి ఎలాంటి అప్‌డేట్ మాత్రం ఇవ్వలేదు.
కేవలం సినిమాలో పాత్రలను పరిచయం చేయడం తప్ప, కథకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ సినిమా టైమ్ ట్రావెలింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు వార్తలు షికార్లు చేసిన విషయం తెలిసిందే. ఆదిత్య 365 చిత్ర దర్శకుడు, సింగీతం శ్రీనివాస్ ప్రాజెక్ట్ కే చిత్రానికి పర్యవేక్షకుడిగా ఉండడంతో ఈ సినిమా టైమ్ ట్రావెలర్ కథాంశంతో తెరకెక్కుతోందని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టైమ్ ట్రావెలింగ్ కథాంశంతో కాదని, భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానుందని తెలుస్తోంది. మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో భారీ యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం.
2024లో విడుదలయ్యే అవకాశం ఉన్న ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ఏకంగా హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. ఒకరు, ఇద్దరు కాదు ఏకంగా నలుగురు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లను తీసుకోనున్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చూడని సన్నివేశాలు ఈ చిత్రంలో ఉండేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నారని టాక్. అందుకోసమే ఈ సినిమాను ఎలాంటి కంప్రమైజ్ లేకుండా తెరకెక్కించేందుకు రూ. 500 కోట్లు ఖర్చు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..