Rashmika Mandanna: బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్ కొట్టేసిన రష్మిక.. ఆ సూపర్ హిట్ సీక్వెల్‌లో శ్రీవల్లి

కన్నడ నుంచి వచ్చి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా సెటిల్ అయ్యింది ముద్దుగుమ్మ రష్మిక మందన్న. నాగ శౌర్య నటించిన చలో సినిమాతో హీరోయిన్ గా తెలుగులో అడుగుపెట్టిన రష్మిక..

Rashmika Mandanna: బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్ కొట్టేసిన రష్మిక.. ఆ సూపర్ హిట్ సీక్వెల్‌లో శ్రీవల్లి
Rashmika Mandanna
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 16, 2022 | 4:02 PM

కన్నడ నుంచి వచ్చి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా సెటిల్ అయ్యింది ముద్దుగుమ్మ రష్మిక మందన్న(Rashmika Mandanna). నాగ శౌర్య నటించిన ఛలో సినిమాతో హీరోయిన్ గా తెలుగులో అడుగుపెట్టిన రష్మిక.. వరుస సినిమాలతో ఇక్కడ బిజీ హీరోయిన్ అయిపోయింది. ఎంట్రీ ఇచ్చిన తక్కువ టైంలోనే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ దక్కించుకొని ఇప్పుడు పాన్ ఇండియా క్రేజ్ అనుకుంది. మహేష్ తో నటించిన సరిలేరు నెక్కెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో చేసిన పుష్ప సినిమా పాన్ ఇండియా హిట్‌గా నిలిచింది. దాంతో ఈ అమ్మడి పేరు అన్ని ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతోంది. ప్రస్తుతం ఈ చిన్నది తెలుగు,తమిళ, కన్నడ భాషలతో పాటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ అలరిస్తోంది.తెలుగులో పుష్ప 2 చేస్తూనే.. తమిళ్‌లో ఏకంగా దళపతి విజయ్ సరసన ఛాన్స్ అందుకుంది.

వంశీ పైడిపల్లి, విజయ్ కాంబోలో వస్తున్న సినిమా వారసుడు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో రష్మిక నటిస్తోంది. ఇక బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలిసి ఓ సినిమా చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడికి మరో జాక్‌పాట్ వచ్చిందన్న టాక్ బీటౌన్ లో వినిపిస్తోంది. ఆషిఖి-3లో రష్మిక ఛాన్స్ దక్కించుకుందని టాక్. గతంలో వచ్చిన ఆషిఖి-1,ఆషిఖి-2 ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆషిఖి-3లో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నాడని ఇప్పటికే టీ సిరీస్ అధికారికంగా ప్రకటించేసింది. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా రష్మిక అయితే బాగుంటుంది అని భావించిన దర్శక నిర్మాతలు ఆమెతో సంప్రదింపులు చేస్తున్నారట. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..