Brahmastra Movie Review : బ్రహ్మాస్త్రం కాదు… స్క్రీన్‌ మీద అగ్ని అస్త్రమే!

రణబీర్‌, ఆలియా పెళ్లయ్యాక విడుదలైన సినిమా ఇది. వారిద్దరూ కలిసి నటించిన ఫస్ట్ సినిమా కూడా ఇదే. నాలుగు వందల కోట్లకు పైగా ఖర్చుపెట్టిన సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా? చదివేయండి.

Brahmastra Movie Review : బ్రహ్మాస్త్రం కాదు... స్క్రీన్‌ మీద అగ్ని అస్త్రమే!
Brahmastra
Follow us
Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Rajitha Chanti

Updated on: Sep 09, 2022 | 6:26 PM

ఎప్పటి నుంచో ఊరిస్తున్న బాలీవుడ్‌ బిగ్‌ మూవీస్‌లో బ్రహ్మాస్త్ర ఒకటి. ఈ సినిమా కోసం వెయిట్‌ చేయడానికి చాలా కారణాలున్నాయి. గత కొన్నాళ్లుగా సంప్‌లో ఉన్న బాలీవుడ్‌ని బ్రహ్మాస్త్ర గట్టెక్కిస్తుందనే ఆశలు నార్త్ లో బాగానే కనిపించాయి. వాటికి తోడు రణబీర్‌, ఆలియా పెళ్లయ్యాక విడుదలైన సినిమా ఇది. వారిద్దరూ కలిసి నటించిన ఫస్ట్ సినిమా కూడా ఇదే. నాలుగు వందల కోట్లకు పైగా ఖర్చుపెట్టిన సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా? చదివేయండి.

నిర్మాణ సంస్థలు: స్టార్‌ స్టూడియోస్‌, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్‌ ఫోకస్‌, స్టార్‌లైట్‌ పిక్చర్స్

నటీనటులు: రణబీర్‌ కపూర్‌, ఆలియా భట్‌, అమితాబ్‌ బచ్చన్‌, షారుఖ్‌ ఖాన్‌, నాగార్జున, మౌనీ రాయ్‌, సౌరవ్‌ గుర్జార్‌, గుర్‌ఫతే పిర్జాదా తదితరులు

ఇవి కూడా చదవండి

రచన – దర్శకత్వం: అయాన్‌ ముఖర్జీ

కెమెరా: వి.మణికందన్‌, పంకజ్‌ కుమార్‌, సుదీప్‌ ఛటర్జీ, పాట్రిక్‌ డ్యూరక్స్

ఎడిటింగ్‌: ప్రకాష్‌ కురూప్‌

సంగీతం (పాటలు) : ప్రీతమ్‌

నేపథ్య సంగీతం: సిమన్‌ ఫ్రాంగ్లెన్‌

నిర్మాతలు: కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతా, నమిత్‌ మల్హోత్రా, రణబీర్‌ కపూర్‌, మరిజక్కే డిసౌజా, అయాన్‌ ముఖర్జీ

సౌత్‌ ప్రెజెంటర్‌: రాజమౌళి నిర్మాణ వ్యయం: 400 కోట్లు

విడుదల: సెప్టెంబర్‌9, 2022

శివ (రణబీర్‌ కపూర్‌) డీజే ప్లేయర్‌. దసరా ఉత్సవాల్లోనూ, మంటపాల్లోనూ డీజే వాయిస్తుంటాడు. లండన్‌ నుంచి తన తాతగారింటికి వచ్చినమ్మాయి ఈషా (ఆలియా). తొలి చూపులోనే ఇద్దరూ ప్రేమలో పడతారు. చాలా మంది అనాథ పిల్లలను చేరదీసి పెంచుతుంటాడు శివ. ఒకసారి శివ ఇంటికి వెళ్తుంది ఈషా. ఆ టైమ్‌లో శివ మనసులో ఏదో అలజడి కలుగుతుంది. ఎక్కడో సైంటిస్ట్ (షారుఖ్‌ఖాన్‌) ని చంపిన దృశ్యాలు ఇతనికి కనెక్ట్ అవుతుంటాయి. సైంటిస్ట్ ని చంపిన ముగ్గురూ నెక్స్ట్ అనీష్‌ (నాగార్జున) అనే ఆర్టిస్ట్ ని చంపడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం చేసుకుంటాడు. ఈషాతో షేర్‌ చేసుకుంటాడు. అనీష్‌ని కాపాడటం కోసం వారణాసికి వెళ్తాడు. శివతో పాటు ఈషా కూడా వెళ్తుంది. బ్రహ్మంశ సభ్యులు కాపాడుతున్న బ్రహ్మాస్త్ర కోసం జునూన్‌ (మౌని రాయ్‌), ఆమె ఇద్దరు అనుచరులు పోరాడుతుంటారు. మూడు భాగాలైన బ్రహ్మాస్త్రలోని ఒక పార్ట్ జునూన్‌కి దక్కుతుంది. ఇంకో భాగం శివ చేతిలో పెడతాడు అనీష్‌. జునూన్‌ టీమ్‌ చేతిలో అనీష్‌ చనిపోతాడు. జునూన్‌ ఆఖరి మజిలీ గురూజీ (అమితాబ్‌). అయితే వాళ్లు అతన్ని చేరుకోవడానికి ముందే గురూజీని చేరుకుంటారు శివ, ఈషా. ఎన్నో అస్త్రాల మీద పట్టు సాధించిన గురూజీ.. శివను అగ్ని అస్త్రంగా గుర్తిస్తాడు. శివ అనాథ కాదని, వాళ్ల అమ్మానాన్నలు కూడా బ్రహ్మాంశ సభ్యులని చెబుతాడు. ఈ సినిమాలో దేవ్‌ ఎవరు? అతనికి అమృతకి ఏంటి సంబంధం? శివ దగ్గరున్న శంఖానికి, బ్రహ్మాస్త్రకి మధ్య లింకు ఏంటి? తనలో ఉన్న అగ్నిని శివ ఎలా ప్రేరేపితం చేశాడు? బ్రహ్మాస్త్ర వల్ల జరగాల్సిన వినాశనాన్ని ఏం చేసి ఆపాడు వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు. మెగాస్టార్‌ చిరంజీవి నెరేషన్‌లో సాగుతుంది సినిమా.

శివ కేరక్టర్‌లో రణబీర్‌ బబ్లీగా, బాధ్యతగా కనిపించారు. సైంటిస్ట్ గా షారుఖ్ చేసిన ఫైట్స్ బావున్నాయి. ఆయన కనిపించినంత సేపు స్క్రీన్‌ మీద వైబ్స్ కనిపించాయి. వానరాస్త్రాన్ని ప్రస్తావించినంత సేపూ కనిపించే విజువల్స్ ఆకట్టుకుంటాయి. థియేటర్లలోనూ సందడి కనిపించింది. అనీష్‌ అనే ఆర్టిస్ట్ కేరక్టర్‌లో నాగార్జున కనిపించినంత సేపు అక్కినేని అభిమానులకు పండగే. నాగార్జున పోర్షన్‌ నంది అస్త్రం తో చేసిన గ్రాఫిక్స్, వారణాసి వాతావరణం బావుంది. గురూజీ కేరక్టర్‌కి అమితాబ్ చక్కగా సూటయ్యారు. అక్కడి ఆశ్రమంలో పలు రకాల అస్త్రాలతో విన్యాసాలు చేయడం బావుంది. అగ్నిని రాజేయడానికి శివ చేసే ప్రయత్నాలు పిల్లలకు నచ్చుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే విజువల్‌ ఎఫెక్ట్స్ అన్నీ పిల్లలకు నచ్చుతాయి. ఈ కథకు ప్రధాన అంశంగా శివ, ఈష ప్రేమను లింకు చేశారు. కానీ కథలో స్పీడు తగ్గడానికి అదే ప్రధాన కారణమని అనిపిస్తుంది. జునూన్‌గా మౌనీరాయ్‌ యాక్టింగ్‌ బావుంది. పాటలను చాలా గ్రాండ్‌గా తెరకెక్కించారు. యాక్షన్‌ సీక్వెన్స్ ఉత్కంఠగా సాగాయి. త్రీడీలో కలర్‌ఫుల్‌గా అనిపించింది బ్రహ్మాస్త్ర. కెమెరా డిపార్ట్ మెంట్‌, ఆర్ట్ డిపార్ట్ మెంట్‌ కష్టం కళ్ల ముందు కనిపిస్తుంది.

కాకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుందో ఊహించే కథనం పెద్దగా ఆకట్టుకోదు. అనవసరమైన సన్నివేశాలతో అక్కడక్కడా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారు. బ్రహ్మాస్త్ర ముక్కలు ముక్కలుగా ఉన్నట్టు, ఈ సినిమాలోనూ అక్కడో ముక్క, అక్కడో ముక్క బావున్నట్టు అనిపిస్తుంది. ఓవరాల్‌గా సినిమాలో ఏదో కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ట్రయాలజీగా అనౌన్స్ అయిన బ్రహ్మాస్త్రలో సెకండ్‌ పార్ట్ ని దేవ్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్. బాటమ్‌ లైన్‌: కథలో బలం లేకపోయినా… ఒకసారి చూడొచ్చు

రేటింగ్‌: 2.5/5

– డా. చల్లా భాగ్యలక్ష్మి