Brahmastra: విలనిజంలో అదరగొట్టిన ‘నాగినీ’.. బ్రహ్మాస్త్రలో మౌనీరాయ్ నటనకు ప్రేక్షకులు ఫిదా..

ఇందులో ఆమె జునూన్ పాత్రలో కనిపించింది. అయితే బ్రహ్మాస్త్రలో విలనిజంలో మౌనీరాయ్ తన నటనతో అదరగొట్టిందంటూ నెటిజన్స్ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Brahmastra: విలనిజంలో అదరగొట్టిన 'నాగినీ'.. బ్రహ్మాస్త్రలో మౌనీరాయ్ నటనకు ప్రేక్షకులు ఫిదా..
Mouni Roy
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 09, 2022 | 5:54 PM

బాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన లేటేస్ట్ చిత్రం బ్రహ్మాస్త్ర (Brahmastra). మిస్టర్ హ్యాండ్సమ్ రణబీర్ కపూర్.. అలియా భట్ జంటగా నటించిన ఈ మూవీ శుక్రవారం పాన్ ఇండియా లెవల్లో విడుదలైంది. ఉదయం నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. గత కొద్దిరోజులుగా వరుస డిజాస్టర్లతో కొట్టుమీట్టాడుతున్న బాలీవుడ్ ఇండస్ట్రీకి .. తాజాగా విడుదలైన బ్రహ్మాస్త్ర కొత్త ఆశలు కలిగిస్తోంది అని చెప్పుకోవచ్చు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్ (Mouni Roy), అక్కినేని నాగార్జున, షారుఖ్ ఖాన్ కీలకపాత్రలలో నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటున్న ఈ సినిమాలో ప్రతినాయకురాలి పాత్రలో నటించింది నాగినీ ఫేమ్ మౌనీరాయ్. ఇందులో ఆమె జునూన్ పాత్రలో కనిపించింది. అయితే బ్రహ్మాస్త్రలో విలనిజంలో మౌనీరాయ్ తన నటనతో అదరగొట్టిందంటూ నెటిజన్స్ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇప్పటివరకు నాగినీ సీరియల్ ద్వారా ప్రేక్షకులను అలరించిన మౌనీ రాయ్.. ఇప్పుడు జునూన్ పాత్రలో తన నటవిశ్వరూపం చూపించిందంటున్నారు. ముఖ్యంగా మౌనీరాయ్, షారుఖ్ ఖాన్ మధ్య వచ్చే సన్నివేశం ప్రేక్షకులను కట్టిపడేసింది. జునూన్, వానర్ అస్త్రా కోసం వారి ఇద్దరి మధ్య వచ్చే సీన్ సూపర్ అంటున్నారు. ఆమె నటన, పాత్ర అద్భుతమని. ఆమె పురాణాలు, అస్త్రాలు, వారు కలిగి ఉన్న శక్తి.. దానిపట్ల అమితమైన గౌరవం .. పూర్తిగా తన నటనతో చూపించందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో మౌనీ రాయ్, బ్రహ్మాస్త్ర, జునూన్ హ్యాష్ ట్యాగ్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. మొత్తానికి అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన బ్రహ్మాస్త్ర బాలీవుడ్ దర్శకనిర్మాతలకు కొత్త ఆశలు కలిగించినట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.