iBomma: ఈరోజు నుంచే ఐబొమ్మ బంద్.. అసలు కారణం ఇదేనంట..
ఈరోజు నుంచి ఐబొమ్మ సేవలు నిలిచిపోయాయి. మన దేశంలో గురువారం అర్ధరాత్రి నుంచి ఐబొమ్మ వెబ్ సైట్ పనిచేయడం లేదు.
సినీప్రియులకు ఐబొమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఓటీటీలకు సబ్స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫుల్ క్వాలిటీ సినిమాలను గత కొద్దిరోజులుగా ఎంజాయ్ చేస్తున్న వాళ్లకు ఐబొమ్మ సుపరిచితమే. ఓటీటీలో విడుదలైన ప్రతి సినిమాను ప్రేక్షకులకు ఉచితంగా అందించి.. వ్యూస్ పెంచుకున్న ఐబొమ్మ (IBomma).. గత కొద్దిరోజులుగా వరుస షాకులు ఇస్తుంది. ఇప్పటికే తమ వెబ్ సైట్ నుంచి సినిమాలు డౌన్ లోడ్ చేసుకునేందుకు ఛాన్స్ లేదంటూ తేల్చి చెప్పిన ఐబొమ్మ.. ఇక సెప్టెంబర్ 9 నుంచి భారతదేశంలో పూర్తిగా షట్ డౌన్ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో సినీ ప్రియులకు ఒక్కసారిగా షాకయ్యారు. అంతేకాదు.. ఇక ఎప్పటికీ తిరిగి రాము.. మెయిల్స్ చేయకండి అంటూ గట్టిగానే రాసుకొచ్చింది. ఈరోజు నుంచి ఐబొమ్మ సేవలు నిలిచిపోయాయి. మన దేశంలో గురువారం అర్ధరాత్రి నుంచి ఐబొమ్మ వెబ్ సైట్ పనిచేయడం లేదు.
అయితే ఐబొమ్మ ఇండియన్ యూజర్లకు ఇచ్చిన దిమ్మతిరిగే షాక్ వెనుక.. కారణాలేంటని తాజాగా ఆరా తీయడం మొదలెట్టారు ఇండియన్ యూజర్లు. దాంట్లో.. ఐబొమ్మ పై వస్తున్న నెగెటివ్ ట్రోలింగ్.. సర్వర్ కాస్ట్.. అండ్ ఇండియాన్ మేకర్స్ … ఓటీటీ జెయింట్స్ నుంచి వస్తున్న ఒత్తిడే కారణం అంటూ.. ప్రాథమికంగా తేల్చారు. అందుకే ఐబొమ్మ ఇండియాకు గుడ్ బై చెప్పింది కావచ్చు అంటూ.. అనుకుంటున్నారు. ఈ విషయాన్ని నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.