Bigg Boss 6 Telugu: బిగ్బాస్ ఫస్ట్ వీక్ కెప్టెన్గా మిస్టర్ కూల్.. జైలుకు వెళ్లేది ఎవరంటే..
కెప్టెన్సీ కోసం ఆదిరెడ్డి, బాలాదిత్య, రేవంత్, ఆరోహి, చాందిని చౌదరి, ఆర్జే సూర్య, మెరీనా, గీతూ, రోహిత్ లు పోటిపడగా. ఆదిరెడ్డి, బాలాదిత్య మధ్య టఫ్ ఫైట్ నడిచింది.
బిగ్బాస్ సీజన్ 6లో (Bigg Boss 6 Telugu) ఇప్పుడే అసలు ఆట మొదలైంది. ఇప్పటివరకు ట్రాష్, క్లాస్ టాస్క్.. నామినేషన్స్ ప్రక్రియతో ఇంట్లో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. కంటెస్టెంట్స్ మధ్య మొదటి వారంలోనే తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడచింది. తొలివారంలో ఏడుగురు నామినేట్ అయ్యారు. ఇక ఇంటి మొదటి కెప్టెన్గా బాలాదిత్య ఎన్నికయ్యాడు. కెప్టెన్సీ పోటీదారులుగా ఉన్న కంటెస్టెంట్లకు కెప్టెన్సీ బండి అనే టాస్క్ ఇచ్చారు. ఈ గేమ్ కు ఫైమాను సంచాలక్ గా నియమించారు. కెప్టెన్సీ కోసం ఆదిరెడ్డి, బాలాదిత్య, రేవంత్, ఆరోహి, చాందిని చౌదరి, ఆర్జే సూర్య, మెరీనా, గీతూ, రోహిత్ లు పోటిపడగా. ఆదిరెడ్డి, బాలాదిత్య మధ్య టఫ్ ఫైట్ నడిచింది. చివరకు మిస్టర్ కూల్ బాలాదిత్య ఇంటి కెప్టెన్ అయ్యారు.
ఇక ఆ తర్వాత ఎవరు బెస్ట్.. ఎవరు వరస్ట్ అనే చర్చ నడిచింది. ఇందులో భాగంగా ఇంటి సభ్యులంతా ఏకాభిప్రాయంతో గీతూను వరస్ట్ గా ఎంపిక చేయడంతో ఆమెను జైలుకు పంపించారు. బిగ్బాస్ ఫుల్ ఎపిసోడ్ లైవ్‍ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో లైవ్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక తొలివారం అభినయ శ్రీ, ఆరోహి, ఇనయ, ఫైమా, శ్రీసత్య, చలాకీ చంటి, సింగర్ రేవంత్ నామినేట్ అయ్యారు. లేటేస్ట్ సమాచారం ప్రకారం.. రేవంత్, ఫైమా, ఆరోహి, చంటికి ఓటింగ్ కాస్త ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.