Bigg Boss 6: ఇదేం గొడవ.. భార్యభర్తల మధ్య శ్రీసత్య పంచాయతీ..

దీంతో తన భార్యకు సారీ చెప్పాడు రోహిత్. ఇక ఇప్పుడు వీరిద్దరి గొడవలోకి శ్రీసత్యను లాగినట్లుగా తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది.

Bigg Boss 6: ఇదేం గొడవ.. భార్యభర్తల మధ్య శ్రీసత్య పంచాయతీ..
Bigg Boss Promo
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 08, 2022 | 8:41 PM

బిగ్‏బాస్.. ఎప్పుడు ఏం జరుగుతుంది. ఎవరి మధ్య ఎలాంటి గొడవలు జరుగుతాయో చెప్పడం కష్టం. ఇక బుల్లితెరపై బిగ్‏బాస్ సీజన్ 6 సందడి మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే నామినేషన్స్ రచ్చతో హీటెక్కిన బిగ్‏బాస్ హౌస్‏లో ఇప్పుడు భార్యభర్తల లొల్లి షూరు అయ్యింది. ఈసారి రియల్ కపూర్ మెరినా.. రోహిత్ జంటగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వచ్చిన సెకండ్ డే నుంచే వీరిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయ్యింది. నా హస్బెండ్ నాతో మాట్లాడం లేదు. హగ్ ఇవ్వడం లేదు. నాకు సమయం కేటాయించడం లేదంటూ అలిగేసింది మెరీనా. దీంతో తన భార్యకు సారీ చెప్పాడు రోహిత్. ఇక ఇప్పుడు వీరిద్దరి గొడవలోకి శ్రీసత్యను లాగినట్లుగా తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది.

తాజాగా విడుదలైన ప్రోమోలో.. గార్డెన్ ఏరియాలో శ్రీసత్యపై చిందులు తొక్కుతుంది మెరీనా. నేను నా హస్బెండ్ మాట్లాడుతుంటే సత్య వచ్చి మనం వాకింగ్ వెళ్దాం రా అనడం ఏంటీ.. అసలు ఆమె ఎవరు అంటూ ఫైర్ అయ్యింది మెరీనా. ఇంతలో సత్య వచ్చి వాకింగ్ వెళ్దాం అనడం కూడా తప్పేనా ? అని అంటుంది. నాకు నా భర్తతో టైం కావాలి. దాన్ని నువ్ ఎలా తీసుకుంటావ్ అని మెరీనా అడగడంతో నీ భర్త నీతో ఉండకపోతే నన్నేం చేయమంటావ్ అంటూ రివర్స్ అయ్యింది శ్రీసత్య. దీంతో ఏడుపు మొదలుపెట్టేసింది మెరీనా. ఇక ఆ తర్వాత యాంకర్ ఆరోహికి.. రేవంత్‏కు మధ్య మాటల యుద్దం నడించింది దీంతో ఆరోహి కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.