Brahmastra: బ్రహ్మస్త్రకు మరిన్ని కష్టాలు.. బయటకొచ్చిన వివేక్ అగ్నిహోత్రి పాత వీడియో.. నెటిజన్స్ ఆగ్రహం..

ఈ క్రమంలో బుధవారం మధ్యప్రదేశ్‏లోని ఉజ్జయిని మహాకాళేశ్వర అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు వెళ్లిన రణబీర్ కపూర్, అలియా భట్‍లకు చెదు అనుభవం ఎదురైంది. వీరిద్దరిని గుడిలోకి వెళ్లకుండా కొందరు అడ్డుకున్నారు.

Brahmastra: బ్రహ్మస్త్రకు మరిన్ని కష్టాలు.. బయటకొచ్చిన వివేక్ అగ్నిహోత్రి పాత వీడియో.. నెటిజన్స్ ఆగ్రహం..
Bramhastra
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 08, 2022 | 3:34 PM

గత కొద్ది రోజులుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే స్టార్ హీరోస్ నటించిన అన్ని చిత్రాలకు బాయ్ కాట్ ట్రెండ్‏తో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ గా నిలిచాయి. ఎన్నో అంచనాల మధ్య భారీ బడ్జెట్‎తో నిర్మించిన సినిమాలు తీవ్రస్థాయిలో నష్టాన్ని చవిచూశాయి. కేవలం గంగూభాయి కతియావాడి, భూల్ భూలయ్య 2 చిత్రాలు మాత్రమే ఆశించినంతగా వసూళ్లు రాబట్టి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. ఇక ఇటీవల విడుదలైన అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా, రణబీర్ కపూర్ షంషేరా చిత్రాలకు కూడా ఈ బాయ్ కాట్ సెగ తగిలింది. తాజాగా బ్రహ్మస్త్ర సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండడంతో సినిమాపై పాజిటివ్ ఓపెనియన్ ఎదురవుతున్నప్పిటికీ నెట్టింట్లో మాత్రం బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డ్ సృష్టిస్తోంది బ్రహ్మస్త్ర (Brahmastra). మరోవైపు ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది చిత్రయూనిట్. రణబీర్ కపూర్, అలియా భట్.. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ మూవీ ప్రమోషన్లు జోరుగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం మధ్యప్రదేశ్‏లోని ఉజ్జయిని మహాకాళేశ్వర అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు వెళ్లిన రణబీర్ కపూర్, అలియా భట్‍లకు చెదు అనుభవం ఎదురైంది. వీరిద్దరిని గుడిలోకి వెళ్లకుండా కొందరు అడ్డుకున్నారు.

బీఫ్ తినే విషయంలో ఈ జంట గతంలో చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ.. భజరంగ్ ధళ్ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. వీరిద్దరూ బీఫ్ తింటారని.. వారికి ఎంతో ఇష్టమని గతంలో చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో రణబీర్, అలియాను గుడిలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో వీరిద్దరు అమ్మవారిని దర్శించుకోకుండానే వెనుదిరిగారు. ఇక ఇప్పుడు బ్రహ్మస్త్ర టీంకు మరిన్ని కష్టాలు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. విడుదలకు ఒక్కరోజు ముందుగా ఆ సినిమా నిర్మాత వివేక్ అగ్నిహోత్రి సైతం బీఫ్ తింటానని చెప్పిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియోలో వివేక్ మాట్లాడుతూ.. తాను బీఫ్ మాంసం తింటానని అంగీకరించాడు. దీంతో అతడిపై నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో వివేక్ ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్న ఫోటో షేర్ చేస్తూ.. బీఫ్ మాంసం తినే ఇతడిని ఎందుకు మహాకాళేశ్వర పూజాలకు అడ్డుకోలేదు. ఎందుకు రణబీర్, అలియాకు దర్శనం నిరాకరించిరంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బ్రహ్మాస్త్ర మూవీ సెప్టెంబర్ 9న పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది. ఇందులో రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్, అక్కినేని నాగార్జున, మౌనీ రాయ్ కీలకపాత్రలలో నటించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.