AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shakeela: “ఆమె చిన్న పిల్ల.. ఎందుకు ఇలా చేస్తున్నారు”.. ఓ రేంజ్ లో ఫైర్ అయిన షకీలా

ప్రతి ఏడాది ఇదే తంతు.. వాళ్ళు విమర్శించడం ఆపారు.. వీళ్లు షోను ఆపారు. ప్రస్తుతం టాలీవుడ్ లో బిగ్ బాస్ సీజన్ 7 జరుగుతోంది. అలాగే తమిళ్ లోనూ బిగ్ బాస్ జరుగుతోంది. తమిళ్ బిగ్ బాస్ లో సంచలన నటి వనిత విజయ్ కుమార్ కూతురు జోవికా విజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు. గతంలో బిగ్ బాస్ లోకి వనిత విజయ్ కుమార్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈసారి సీజన్ లో ఆమె కూతురు జోవికా విజయ్ కుమార్ పాల్గొన్నారు.

Shakeela: ఆమె చిన్న పిల్ల.. ఎందుకు ఇలా చేస్తున్నారు.. ఓ రేంజ్ లో ఫైర్ అయిన షకీలా
Shakeela
Rajeev Rayala
|

Updated on: Nov 07, 2023 | 6:50 PM

Share

బిగ్ బాస్ అంటే చాలా మంది పాజిటివ్ గా రెస్పాండ్ అయితే కొంతమంది మాత్రం వైల్డ్ గా రియాక్ట్ అవుతూ ఉంటారు. చాలా మంది ఈ గేమ్ షో పై విమర్శలు చేస్తూ ఉంటారు. ప్రతి ఏడాది ఇదే తంతు.. వాళ్ళు విమర్శించడం ఆపారు.. వీళ్లు షోను ఆపారు. ప్రస్తుతం టాలీవుడ్ లో బిగ్ బాస్ సీజన్ 7 జరుగుతోంది. అలాగే తమిళ్ లోనూ బిగ్ బాస్ జరుగుతోంది. తమిళ్ బిగ్ బాస్ లో సంచలన నటి వనిత విజయ్ కుమార్ కూతురు జోవికా విజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు. గతంలో బిగ్ బాస్ లోకి వనిత విజయ్ కుమార్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈసారి సీజన్ లో ఆమె కూతురు జోవికా విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఇక బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవరసం లేదు. గొడవలు, ఏడుపులు, అల్లర్లతో నానా రచ్చగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఒకరి పై ఒకరు గొడవలు పెట్టుకుంటూ ఉంటారు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవారు జోవికా విజయ్ కుమార్ తో గొడవ పెట్టుకున్నారు. జోవికా విజయ్ కుమార్ తల్లిలానే స్టైట్ గా మాట్లాడుతుంది. ఏ విషయానైనా తడబడకుండా మాట్లాడుతూ తన వాదన వినిపిస్తుంటుంది. తనదైన స్టైల్ లో గేమ్ ఆడుతూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. జోవికా విజయ్ కుమార్ వయసు కేవలం 18 ఏళ్ళు మాత్రమే. అయినా కూడా తన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇదిలా ఉంటే కొంతమంది జోవికా విజయ్ కుమార్  తండ్రి ఎవరు..? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. వనిత విజయ్ కుమార్ మొదటి భర్త ఆకాష్ కూతురు. అయితే ఆతర్వాత వనిత రెండు భర్త ఆకాష్ జోవికా తండ్రి కాదులవర్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇక ఇప్పుడు మరోసారి జోవికా విజయ్ కుమార్  తండ్రి ఎవరు అంటూ సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. దాంతో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వారిపై నటి షకీలా ఫైర్ అయ్యారు. జోవికా తండ్రి ఎవరో నాకు తెలుసు అని అన్నారు షకీలా. ఆమె పుట్టిన దగ్గర నుంచి నాకు తెలుసు. జోవికా కు ఓ సోదరి, సోదరుడు కూడా ఉన్నారు. ఇలా పర్సనల్ విషయాల పై కామెంట్స్ చేయకుండదు. నేను కూడా మిమల్ని అడుగుతున్న నీ తండ్రి ఎవరు..? పిల్లల తండ్రి ఎవరు అన్నది తల్లులకు మాత్రమే తెలుసు . జోవికా చిన్న పిల్లా రేపు ఆమె పెళ్లి చేయాలి ఇలాంటి ప్రశ్నలతో ఎందుకు వాళ్ళను భాదపెడుతున్నారు. జోవిక తండ్రి ఆకాష్ అని గతంలోనే వనిత చెప్పింది. ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసే వారు నాముందుకు వస్తే కొడతా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు షకీలా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్