Katrina Kaif: కత్రినా కైఫ్‌ను కూడా వదలని పోకిరీగాళ్లు.. వైరల్ అవుతోన్న అమ్మడి డీప్ ఫేక్ ఫోటో
సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ రా ఏజెంట్స్‌గా... మనీష్ శర్మా డైరెక్షన్లో.. యశ్ రాజ్ ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న ఫిల్మ్ టైగర్ 3. టైగర్ ఫ్రాంచైజీలో భాగంగా... వైఆర్ ఎఫ్ స్పై యూనివర్స్‌లో వన్ ఆఫ్ ది సినిమాగా వస్తున్న ఈసినిమా దివాళీ కానుకగా.. నవంబర్ 12న రిలీజ్‌కు రెడీ అవుతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా.. సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ రా ఏజెంట్స్‌గా… మనీష్ శర్మా డైరెక్షన్లో.. యశ్ రాజ్ ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న ఫిల్మ్ టైగర్ 3. టైగర్ ఫ్రాంచైజీలో భాగంగా… వైఆర్ ఎఫ్ స్పై యూనివర్స్‌లో వన్ ఆఫ్ ది సినిమాగా వస్తున్న ఈసినిమా దివాళీ కానుకగా.. నవంబర్ 12న రిలీజ్‌కు రెడీ అవుతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా.. సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది. దాంతో పాటే సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగేలా చేసింది.
అయితే ఈ ట్రైలర్ లోనే కత్రినా టవల్‌పై ఓ ఫైట్ సీన్ చేసినట్టు ఓ సీన్ ఉంది. అది కాస్తా నెట్టింట హాట్ టాపిక్ అయింది. ఇక రీసెంట్‌గా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియలోనూ.. ఆ సీన్ గురించి కత్రినా మాట్లాడింది. అయితే ఈ సీన్‌లోని.. కత్రినా టవల్ పై ఉన్న ఫోటోనే… కొంత మంది కేటుగాళ్లు AIసాయంతో మార్ఫింగ్ చేశారు. ఆమె కట్టుకున్న టవల్‌ను రిమూవ్ చేసి.. ఇన్నర్స్‌లో పైట్ చేస్తన్నట్టు చూపించారు. ఆ ఫోటోలను కాస్త నెట్టింట ఓ రేంజ్లో కూడా వైరల్ అయ్యేలా చేస్తున్నారు.
టెక్నాలిజీ విపరీతంగా డెవలప్ అవుతున్న వేళ.. కొంత మంది దాన్ని మిస్ యూజ్ చేస్తున్నారు. ఆ టెక్నాలిజీ సాయంతో.. అమ్మాయిల, అందులోనూ హీరోయిన్ల మానాన్ని తీసే ప్రయత్నం చేస్తున్నారు. వారిని ఇన్నర్ వేర్లో..లేదా.. న్యూడ్ గా మార్చేస్తున్నారు. ఆ ఫోటోలనే నెట్టింట వైరల్ కూడా చేస్తూ… మరో వికృత చర్యకు ఆధ్యులవుతున్నారు. రష్మిక విషయంలో ఇదే చేశారు. ఆమెను ఇన్నర్ వేర్‌లో కనిపించేలా ఓ వీడియోను మార్ఫింగ్ చేసి.. ఆమెను బాధపెట్టారు. ఇక ఇప్పుడు కత్రినా కైఫ్ టైగర్ 3 ఫోటోలను కూడా మార్పింగ్ చేసి.. ఆమెను కూడా బాధపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఫోటోలను నెట్టింట మరో సారి వైరల్ అయ్యేలా కూడా చేస్తున్నారు కొంతమంది AIపోకిరీగాళ్లు.
[HQ] Full image from the shooting of towel fight scene between #KatrinaKaif and #MichelleLee in #Tiger3 🐯 https://t.co/Kenmce6AkU pic.twitter.com/HdO2lqhajr
— 𝖪𝖺𝗍𝗋𝗂𝗇𝖺 𝖪𝖺𝗂𝖿 𝖥𝖺𝗇𝗌 (@KatrinaKaifCafe) November 6, 2023
కత్రినా కైఫ్ ఫ్యాన్ ట్విటర్ పోస్ట్
#KatrinaKaif and #MichelleLee shooting for the most awaited towel fight scene of #Tiger3!
Read what Kat has to say about it: https://t.co/NPUG1mk6AZ pic.twitter.com/MRmnJsgUHZ
— 𝖪𝖺𝗍𝗋𝗂𝗇𝖺 𝖪𝖺𝗂𝖿 𝖥𝖺𝗇𝗌 (@KatrinaKaifCafe) November 6, 2023