
బిగ్ బాస్ హౌస్ లో రకరకాల బాండింగ్స్ కనిపిస్తున్నాయి. దివ్య భరణిని నాన్న అని పిలవడం.. రీతూ చౌదరి డిమాన్ పవన్ వెనక తిరగడం.. సంజన ఇమ్మాన్యుయేల్ ను కొడుకు అంటూ హడావిడి చేయడం.. మరో వైపు తనూజ కూడా భరణిని నాన్న నాన్న అంటూ ఆయనతో కలివిడిగా ఉండటం చేస్తున్నారు. అయితే నేను ఎవరితోనూ బాండింగ్స్ పెట్టుకోవడానికి రాలేదు.. గేమ్ ఆడటానికి వచ్చాను అంటూ మొదట్లో అరిచి మరీ రాద్ధాంతం చేసిన దువ్వాడ మాధురి కూడా చివరకు బాండింగ్ పెట్టుకోక తప్పలేదు.. మాధురి హౌస్ లో ఎవరికైనా దగ్గరయ్యిందంటే అది తనూజాతోనే.. మధురి,తనూజ రాజా రాజా అంటూ పిలుచుకుంటూ తెగ తిరిగారు. కానీ నిన్నటి ఎపిసోడ్ లో మాధురి గట్టిగానే హర్ట్ అయ్యింది.
భరణి, శ్రీజ ఎలిమినేట్ అయిన తర్వాత తిరిగి మరోసారి హౌస్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ ఇద్దరిలో ఒకరు మాత్రమే హౌస్ లో ఉండనున్నారు. ఇందుకోసం రకరకాల టాస్క్ లు పెడుతున్నాడు బిగ్ బాస్. ఆ టాస్క్ ల్లో గెలిచిన వారే హౌస్ లో పర్మినెంట్ హౌస్ మెంబర్ కానున్నారు. అయితే ఈ టాస్క్ ల్లో భరణీ టీమ్ గెలిచారని తెలుస్తుంది. దాంతో శ్రీజ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వనుందని సమాచారం. ఇదిలా ఉంటే హౌస్ లోకి భరణి రావడంతో సీన్స్ మారిపోయాయి.
భరణి ఎంటర్ అవ్వడంతో తనూజ, దివ్య పిచ్చ హ్యాపీగా ఫీల్ అయ్యారు. భరణి చుట్టూ తిరుగుతూ సందడి చేస్తున్నారు దివ్య, తనూజ.. కాగా తనూజ మొన్నటి వరకు మధురితో క్లోజ్ గా తిరిగింది. కట్ చేస్తే ఇప్పుడు భరణితో క్లోజ్ అయ్యింది. దాంతో మాధురి గట్టిగానే హర్ట్ అయ్యింది. తనూజాతో గొడవ కూడా పెట్టుకుంది. అంతే కాదు అన్నం తినకుండా అలిగింది. హౌస్ మెంబర్స్ ఎంత చెప్పినా కూడా ఆమె భోజనం చేయలేదు. అసలు మాధురి ఎందుకు అలిగిందో ఎవరికీ తెలియదు. ఎంతమంది బ్రతిమిలాడినా కూడా ఆమె అన్నం తినకుండా కన్నీళ్లు పెట్టుకుంది. ఇమ్మాన్యుయేల్, సంజన , సుమన్ శెట్టి మధురిని చాలా సేపు బ్రతిమిలాడారు. తనూజ కూడా మాధురి ఎందుకు అలిగిందో ఎందుకు గొడవ పెట్టుకుంటుందో అర్ధం కావడంలేదు అంటూ అరిచి రచ్చ చేసింది. చివరకు తనూజ మాధురి దగ్గరికొచ్చి నాకు జడేస్తావా అని తనూజ అడిగింది.. దాంతో ఆమె జడవేసింది. ఫైనల్ గా మాధురి అలక తీరింది.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి