Keerthi Bhat: గ్రాండ్‌గా ‘కార్తీక దీపం’ ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. సందడి చేసిన సెలబ్రిటీస్‌.. ఫొటోస్‌ చూశారా?

ప్రముఖ బుల్లితెర నటి, బిగ్‌బాస్‌ ఫేం కీర్తీ భట్‌ త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. ప్రముఖ నటుడు విజయ్‌ కార్తీక్‌తో కలిసి జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు ఆదివారం కీర్తీ భట్‌- విజయ్‌ల ఎంగేజ్‌మెంట్‌ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. పలువురు బుల్లితెర నటీనటులు, బిగ్‌ బాస్‌ సెలబ్రిటీలు ఈ ఫంక్షన్‌లో సందడి చేశారు. కాబోయే దంపతులను మనసారా ఆశీర్వదించారు.

Keerthi Bhat: గ్రాండ్‌గా 'కార్తీక దీపం' ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. సందడి చేసిన సెలబ్రిటీస్‌.. ఫొటోస్‌ చూశారా?
Keerthi Bhat Engagement
Follow us
Basha Shek

|

Updated on: Aug 21, 2023 | 5:10 PM

ప్రముఖ బుల్లితెర నటి, బిగ్‌బాస్‌ ఫేం కీర్తీ భట్‌ త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. ప్రముఖ నటుడు విజయ్‌ కార్తీక్‌తో కలిసి జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు ఆదివారం కీర్తీ భట్‌- విజయ్‌ల ఎంగేజ్‌మెంట్‌ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. పలువురు బుల్లితెర నటీనటులు, బిగ్‌ బాస్‌ సెలబ్రిటీలు ఈ ఫంక్షన్‌లో సందడి చేశారు. కాబోయే దంపతులను మనసారా ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన కీర్తి తెలుగులో మనసిచ్చి చూడు సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చింది. కార్తీక దీపం సీరియల్‌తో సూపర్‌ క్రేజ్‌ తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా పలు సూపర్‌ హిట్‌ సీరియల్స్‌లో నటించి బుల్లితెర ఆడియెన్స్‌కు బాగా చేరువైంది. ఇక బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 6లోనూ సందడి చేసింది. ఆ సీజన్‌లో టాప్‌ 3 కంటెస్టెంట్‌గా అందరి మనసులు గెల్చుకుంది.

సాఫ్ట్ వేర్ జాబ్ ను వదిలి..

ఇక కీర్తికి కాబోయే వరుడు విజయ్‌ కార్తీక్‌ విషయానికి వస్తే.. చిత్తూరులోని మదనపల్లి అతని స్వగ్రామం. మొదట సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా కెరీర్‌ ప్రారంభించాడు. అయితే సినిమాల మీద ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. మొదట కన్నడ సినిమా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ నాలుగు సినిమాల్లో హీరోగా నటించాడు. ఆ తర్వాత తెలుగులోనూ అదృష్టం పరీక్షించుకున్నాడు. ఏబీ పాజిటివ్‌, చెడ్డీ గ్యాంగ్‌ అనే సినిమాల్లో మెరిశాడు. కీర్తి- విజయ్‌ల ఎంగేజ్‌మెంట్‌ ఫంక్షన్‌కు హాజరైన వారిలో బాలాదిత్య, ఆదిరెడ్డి తదితరులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

కీర్తి భట్ ఎంగేజ్ మెంట్ ఫొటోస్

కీర్తి భట్, విజయ్ కార్తీక్ ల ఫొటోస్

కీర్తి భట్ ఇన్ స్టా గ్రామ్ పోస్టులివే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?