Bigg Boss 9: లక్ అంటే నీదే అమ్మడు.. ఈ వారం కూడా తప్పించుకుంది..
బిగ్ బాస్ సీజన్ 9 నుంచి ఒకొక్కరిగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తున్నారు. గతవారం హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం నామినేషన్స్ గరం గరంగా జరిగాయని తెలుస్తుంది. అలాగే హౌస్ మేట్స్ మధ్య పెద్ద యుద్ధమే జరిగిందని తెలుస్తుంది

బిగ్ బాస్ సీజన్ 9 నుంచి వారం వారం ఒకొక్కరు ఎలిమినేట్ అవుతున్నారు. ఇక గతవారం ఏకంగా ఇద్దరు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. శనివారం హౌస్ నుంచి నిఖిల్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. అలాగే ఆదివారం ఎపిసోడ్ లో గౌరవ్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. నిన్నటి ఎపిసోడ్ లో గౌరవ్, దివ్య ఎలిమినేషన్స్ లో చివరి వరకు వచ్చారు. ఫైనల్ గా దివ్య సేవ్ అయ్యి గౌరవ్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే తనూజ దగ్గరున్న స్పెషల్ పవర్ తో గౌరవ్ ను సేవ్ చేస్తే దివ్య ఎలిమినేట్ అవుతుంది అని చెప్పారు నాగార్జున. అయితే తనూజ మాత్రం జనాల నిర్ణయాన్ని గౌరవిస్తా.. న పవర్ ను వాడను అని చెప్పింది. దాంతో గౌరవ్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. ఇక సోమవారం నామినేషన్స్ గరం గరంగా జరిగాయని తెలుస్తుంది.
ఇక ముందుగా భరణి ఇమ్మాన్యుయేల్ ను, రీతూ చౌదరిని నామినేట్ చేశాడు. ఆతర్వాత ఇమ్మాన్యుయేల్ కు ఛాన్స్ రాగానే రీతూ చౌదరిని, భరణిని నామినేట్ చేశాడు. కళ్యాణ్ డిమాన్ పవన్ ను, సంజనాను నామినేట్ చేశాడు. దాంతో సంజనకు కళ్యాణ్ కు మధ్య వాదన జరిగిందని తెలుస్తుంది. ఇక డిమాన్ పవన్ కు ఛాన్స్ రాగానే కళ్యాణ్ ను నామినేట్ చేశాడు. ఆతర్వాత ఊహించని విధంగా రీతూ చౌదరిని నామినేట్ చేశాడు. దాంతో పవన్ కు రీతూ మధ్య పెద్ద మాటల యుద్ధం జరిగిందని తెలుస్తుంది.
రీతూ చౌదరి ఛాన్స్ రాగానే ముందుగా దివ్యను నామినేట్ చేసింది. ఈ ఇద్దరి మధ్య కూడా పెద్ద గొడవ జరిగిందని తెలుస్తుంది. దివ్య తర్వాత సంజనాను నామినేట్ చేసింది. ఇక సంజన ఛాన్స్ రాగానే కళ్యాణ్ ను నామినేట్ చేసింది. దివ్య రీతూని నామినేట్ చేసింది. ఫైనల్ గా సుమన్ శెట్టి కళ్యాణ్ ను నామినేట్ చేశాడు. ఇక నామినేషన్ అయిన తర్వాత కెప్టెన్ తనూజాకు ఓ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. నామినేషన్స్ లో ఉన్న వారిలో ఒకరిని సేవ్ చేసే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. దాంతో తనూజ రీతూని నామినేట్ చేసిందని తెలుస్తుంది. ఫైనల్ గా ఈ వారం ఎలిమినేషన్స్ నుంచి రీతూ తప్పించుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








