Bigg Boss 8 Telugu: కాఫీ కోసం నామినేట్ చేయడం ఏంటి బేబక్క..! శేఖర్ భాషకు పృథ్వీ కౌంటర్..

కిచెన్‌లో జరిగిన సంఘటనతో బేబక్కను నామినేట్ చేశాడు శేఖర్ బాషా. అయితే బేబక్క‌ను నామినేట్ చేసే సమయంలో పృథ్వీ వైపు చూస్తూ చెప్పాడు బాషా. దాంతో నావైపు ఎందుకు చూస్తున్నావ్ అంటూ సైగలు చేశాడు. నాకు ఇదే కంఫర్ట్.. ఇలా మాట్లాడకూడదంటూ బిగ్‌బాస్ చెప్పాడా.? అని వాదించాడు శేఖర్ బాషా. దానికి పృథ్వీ కాస్త గట్టిగానే ఇచ్చాడు.

Bigg Boss 8 Telugu: కాఫీ కోసం నామినేట్ చేయడం ఏంటి బేబక్క..! శేఖర్ భాషకు పృథ్వీ కౌంటర్..
Bigg Boss 8
Follow us

|

Updated on: Sep 04, 2024 | 9:17 AM

నిన్నటి ఎపిసోడ్ లోనే నామినేషన్స్ హడావిడి మొదలైంది. నామినేషన్‌లో ముందుగా సోనియాకు అవకాశం వచ్చింది. దాంతో సోనియా బెబక్కను, ప్రేరణను నామినేట్ చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ చీఫ్‌లుగా నామినేట్ అయిన యష్మి బెబక్కను సెలక్ట్ చేసి ప్రేరణను సేవ్ చేసింది. ఆ తర్వాత నబీల్ నాగ మణికంఠను, బేబక్కను నామినేట్ చేశాడు. ఆతర్వాత చీఫ్ యష్మి బేబక్కను సేవ్ చేసి నాగమణికంఠను సెలక్ట్ చేసింది. ఆతర్వాత నామినేషన్ అవకాశం శేఖర్ బాషాకు ఛాన్స్ వచ్చింది. ముందుగా నాగ మణికంఠను నామినేట్ చేశాడు శేఖర్ బాషా. చీఫ్‌లుగా వాళ్లు ఫిట్ కాదంటూ మణికంఠ కామెంట్స్ చేయడం తనకు నచ్చలేదు అని చెప్పాడు శేఖర్ బాషా. ఆతర్వాత బేబక్కను నామినేట్ చేశాడు శేఖర్ బాషా.

కిచెన్‌లో జరిగిన సంఘటనతో బేబక్కను నామినేట్ చేశాడు శేఖర్ బాషా. అయితే బేబక్క‌ను నామినేట్ చేసే సమయంలో పృథ్వీ వైపు చూస్తూ చెప్పాడు బాషా. దాంతో నావైపు ఎందుకు చూస్తున్నావ్ అంటూ సైగలు చేశాడు. నాకు ఇదే కంఫర్ట్.. ఇలా మాట్లాడకూడదంటూ బిగ్‌బాస్ చెప్పాడా.? అని వాదించాడు శేఖర్ బాషా. దానికి పృథ్వీ కాస్త గట్టిగానే ఇచ్చాడు. అవునా అయితే మీ నామినేషన్ మధ్యలో నేను మాట్లాడతా.. మీరు కూర్చోమన్నా నేను కూర్చోను.. ఎందుకంటే బిగ్‌బాస్ చెప్పలేదు అని పృథ్వీ కౌంటర్ ఇచ్చాడు. ఇక చీఫ్ గా ఉన్న నైనిక బేబక్కను సేవ్ చేసి నాగ మణికంఠను సెలక్ట్ చేసింది.

ఆతర్వాత రంగంలోకి బేబక్క వచ్చింది. ఆమె పృథ్వీని నామినేట్ చేసింది. కాఫీ కావాలన్నా.. ఏం కావాలన్నా మీరు అడుగుతున్నారు తప్ప ఎలాంటి హెల్ప్ చేయడం లేదు అని చెప్పింది బేబక్క. నేను కిచెన్ డిపార్ట్‌మెంట్ కాదు కదా.. మీరు హెల్ప్ చేయమని అడిగితే నేను చేసేవాడిని.. ఇంతలో గిన్నెలు కడిగావు కదా చెప్పు..అని పక్కనే ఉన్న కిరాక్ సీత అంది. గిన్నెలు కడిగాడు అక్కా.. వెజిటేబుల్స్ కూడా కోశాడు అక్క అని అంది సీత. దాంతో నిఖిల్ మధ్యలో దూరి వాదనకు దిగాడు. నువ్వు మాట్లాడొద్దు అంటూ సీతపై అరిచాడు. దానికి సీత కూడా గట్టిగానే ఇచ్చింది. నా ఇష్టం నేను మాట్లాడతా.. నువ్వు మాట్లాడినప్పుడు నేను కూడా మాట్లాడతా అంటూ కౌంటర్ ఇచ్చింది. ఒక్క కాఫీ కోసం నామినేట్ చేశారా అంటూ బేబక్కను అడిగాడు పృథ్వీ. ఆ తర్వాత నబీల్‌ను నామినేట్ చేసింది. నీలో ఫైర్ ఉంది అది బయటకు రావాలి తమ్ముడు అని అతన్ని నామినేట్ చేసింది. ఆ తర్వాత పృథ్వీ సెలక్ట్ చేసి నబీల్ ను సేవ్ చేశాడు నిఖిల్. దాంతో సగం నామినేషన్ పూర్తయ్యింది. రేపటి ఎపిసోడ్ లో ఇంకెన్ని చూడాలో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి