అదే ప్రేమను కొనసాగించాల్సింది నోయల్ !
ఇప్పటివరకు అంతా బానే ఉంది నోయల్. హౌస్ నుంచి బయటకు వెళ్లే సమయంలో మాత్రం కాస్త బ్యాడ్ అయ్యావ్ అంటున్నారు బిగ్ బాస్ చూసే నెటిజన్లు.
ఇప్పటివరకు అంతా బానే ఉంది నోయల్. హౌస్ నుంచి బయటకు వెళ్లే సమయంలో మాత్రం కాస్త బ్యాడ్ అయ్యావ్ అంటున్నారు బిగ్ బాస్ చూసే నెటిజన్లు. తోటి కంటెస్టెంట్ల మాటలు బాధిస్తే అక్కడే చెప్పాల్సింది పోయి..బయటకు వచ్చాక ప్రతాపం చూపించడం కరెక్ట్ కాదని చెబుతున్నారు. తనకు కావాల్సిన వారికి మేలు చేయాలనే ఆలోచనతోనే అతడు ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. నిజంగా శనివారం నాటి ఎపిసోడ్‌లో కొత్త నోయల్ కనిపించాడు. అతడి ఫేస్‌లో కోపం..మాటల్లో ఆవేశం కనిపించింది. ఒక రకంగా ఇప్పటివరకు చూసిన నోయల్ వేరా..అతనిలో ఇంకో మనిషి ఉన్నారా అనే భావన కలిగింది. నూరు రోజుల్లో ముగిసేపోయే ఆట ఇది…దాని కోసం ఇందరి మనుసుల్లో కొత్త అనుమానులు రేకిత్తించాలా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గతంలో కుమార్ సాయిని టార్గెట్ చేసిన నోయల్..అతడిని పదే..పదే నామినేట్ చేశారు. ఆపై ‘ఒక్కరోజన్న నిజాయితీగా ఆడు’ అంటూ మాటల తూటాలు పేల్చాడు. అయితే నోయల్ చెబుతున్నాడంటే అందులో విషయం ఉంటుంది అని అందరూ భావించారు. కానీ ఇప్పుడు అతని ప్రవర్తన చూస్తుంటే ప్రణాళిక ప్రకారమే కుమార్ సాయిని టార్గెట్ చేశారాా అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. ప్రారంభం నుంచి చూపిన ప్రేమను శనివారం హౌస్‌లో నుంచి బయటకు వచ్చాక కూడా ప్రదర్శించే ఉంటే నోయల్ స్థాయి కచ్చితంగా వేరే ఉండేంది.
Also Read :
వైభవంగా సిరివెన్నెల తనయుడి వివాహం