ఇవేనా పిల్లలకు నేర్పించే విలువలు.? రష్మి ఆవేదన..
ర్యాంకుల వేటలో పడి పిల్లలకు జీవిత పాఠాలను నేర్పించడంలో విఫలమవుతున్నామని యాంకర్ రష్మి గౌతమ్ అన్నారు.
Anchor Rashmi Gautam Viral Tweet: ర్యాంకుల వేటలో పడి పిల్లలకు జీవిత పాఠాలను నేర్పించడంలో విఫలమవుతున్నామని యాంకర్ రష్మి గౌతమ్ అన్నారు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా పైవిధంగా స్పందించిన ఆమె.. పిల్లలకు మానవత్వం, జీవిత విలువలు నేర్పించాల్సిన అవసరం ఎంతగానో ఉందని పేర్కొన్నారు. తమిళనాడుకు చెందిన సెంథిల్ కుమార్ అనే యానిమల్ లవర్ ట్విట్టర్‌లో వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో ఓ బాలుడు కుక్క పిల్లను నీటి తొట్టి దగ్గరకు తీసుకెళ్లి అందులో పడేసి చనిపోయేలా చేశాడు. దీనిపై తాజాగా రష్మి స్పందించారు.
”డిగ్రీలు సాధించి అందరి కంటే రేసులో ముందు ఉండాలనే తపనతో ప్రాథమిక జీవిత పాఠాలు నేర్పించడంలో మనం విఫలమవుతున్నాం. మన భవిష్యత్తు ఇలాగే ఉంటుంది” అని ట్వీట్ చేయడమే కాకుండా మానవత్వం చచ్చిపోయిందని హ్యాష్‌ట్యాగ్ జత చేశారు. కాగా, ఆమె చేసిన ఈ ట్వీట్‌కు నెటిజన్లు మద్దతు తెలిపారు. చిన్నతనంలోనే పిల్లలకు ఏది మంచి.? ఏది చెడు.? అన్నవి నేర్పించాలని కామెంట్స్ చేస్తున్నారు.
In the quest of achieving degrees and wining the rat race We are failing at teaching basic life lessons This is what our future looks like #RIPHumanity https://t.co/8r5eW9ufgv
— rashmi gautam (@rashmigautam27) October 31, 2020