వెండితెరపై ‘దర్శకుడి’గా నేచురల్​ స్టార్​..

నేచురల్ స్టార్ నాని దర్శకుడు కావాలనే కోరికతో ఫీల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే కొందరు దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.

  • Ram Naramaneni
  • Publish Date - 4:53 pm, Sun, 1 November 20
వెండితెరపై 'దర్శకుడి'గా నేచురల్​ స్టార్​..

నేచురల్ స్టార్ నాని దర్శకుడు కావాలనే కోరికతో ఫీల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే కొందరు దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి  ‘అష్టాచమ్మా’తో నాని హీరోగా పరిచయం చేశారు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో నాని ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. అయితే ఎంత ఎత్తుకి ఎదిగినా తరచూ తాను అసిస్టెంట్ దర్శకుడిగా ఉన్న రోజుల్ని గుర్తు చేసుకుంటుంటాడు నాని. ఫ్యూచర్‌లో దర్శకత్వం చేస్తారో లేదో కానీ, తెరపై మాత్రం దర్శకుడిగా సందడి చేయనున్నట్టు తెలిసింది.

ప్రస్తుతం ‘టక్‌ జగదీష్‌’లో నటిస్తున్న నాని పలు కొత్త ప్రాజెక్టులకు  ఓకే చెప్పారు. త్వరలోనే పట్టాలెక్కనున్న ఓ సినిమాలో నాని సినీ దర్శకుడి పాత్రలో కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం. సహాయ దర్శకుడిగా నిజ జీవిత పాత్రని ఆయన ఇదివరకు ‘మజ్ను’ చిత్రంలో చేశారు. అందులో దర్శక ధీరుడు రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ కనిపించారు. ‘గ్యాంగ్‌లీడర్‌’లో పెన్సిల్‌ పార్థసారథి అనే రచయితగా కనిపించి నవ్వులు పంచాడు. ఇక ‘అలా మొదలైంది’ సినిమాలో ఓ టీవీ దర్శకుడిగా అలరించారు.

Also Read :

వైభవంగా సిరివెన్నెల తనయుడి వివాహం

అతడు బౌలింగ్ వేస్తే..విరాట్ పెవిలియన్‌కే