అతడు బౌలింగ్ వేస్తే..విరాట్ పెవిలియన్‌కే

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేసర్‌ సందీప్‌ శర్మ ఏకంగా భారత కెప్టెన్ విరాట్ వికెట్‌నే టార్గెట్ చేశాడు. ఈ క్రమంలో అతడు క్రేజీ రికార్డు అందుకున్నాడు.

అతడు బౌలింగ్ వేస్తే..విరాట్ పెవిలియన్‌కే
Follow us

|

Updated on: Nov 01, 2020 | 4:33 PM

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేసర్‌ సందీప్‌ శర్మ ఏకంగా భారత కెప్టెన్ విరాట్ వికెట్‌నే టార్గెట్ చేశాడు. ఈ క్రమంలో అతడు క్రేజీ రికార్డు అందుకున్నాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి(7) ఔట్‌ చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు.  సందీప్‌ శర్మ వేసిన ఐదో ఓవర్‌ నాల్గో బంతికి విలియమ్సన్‌ క్యాచ్‌ పట్టడంతో కోహ్లి అవుటయ్యాడు. దీంతో ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లిని అత్యధిక సార్లు ( ఏడు సార్లు) ఔట్‌ చేసిన రికార్డును సందీప్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. గత సీజన్‌లో  అత్యధిక సార్లు కోహ్లిని ఔట్‌ చేసిన రికార్డును సమం చేసిన సందీప్‌.. దాన్ని తాజాగా అధిగమించాడు.

ఐపీఎల్‌లో కోహ్లిని ఆరుసార్లు పెవిలియన్‌కు పంపిన బౌలర్‌ ఆశిష్‌ నెహ్రా.  ఇప్పుడు నెహ్రా రికార్డు బద్దలు కొట్టాడు సందీప్‌. ఐపీఎల్‌లో కోహ్లిని అత్యధిక సార్లు ఔట్‌ చేసిన జాబితాలో సందీప్‌, నెహ్రాల తర్వాత ప్లేసులో మిచెల్‌ మెక్లీన్‌గన్‌, మహ్మద్‌ షమీలు ఉన్నారు. వీరిద్దరూ తలో మూడుసార్లు కోహ్లిని ఔట్‌ చేశారు. ఇక ఐపీఎల్‌లో ఒక ప్లేయర్‌ను అత్యధిక సార్లు ఔట్‌ చేసిన లిస్ట్‌లో జహీర్‌ఖాన్‌తో కలిసి సందీప్‌ శర్మ సంయుక్తంగా ఫస్ట్ ప్లేసులో నిలిచాడు. చెన్నై కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిని జహీర్‌ఖాన్‌ అత్యధికంగా ఏడుసార్లు పెవిలియన్‌కు పంపాడు.

Also Read : వైభవంగా సిరివెన్నెల తనయుడి వివాహం