AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayesha Khan: ఆ యాంగిల్స్ ఏంటి..? ఎక్కడ పడితే అక్కడ జూమ్ చేస్తారా..? మండిపడ్డ హీరోయిన్

గ్లామర్ ఫోటోలను, వీడియోలను షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు ముద్దుగుమ్మలు. అయితే కొంతమంది కేటుగాళ్లు మాత్రం హీరోయిన్స్ ఫోటోలను మిస్ యూస్ చేస్తూ ఉంటారు. మొన్నీమధ్య డీప్ ఫేక్ వీడియోలు సెలబ్రెటీలకు లేనిపోని తలనొప్పులు తెచ్చిన విషయం తెలిసిందే. వేరే వారి హాట్ ఫోటోలకు, వీడియోలకు హీరోయిన్స్ ముఖాలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు.

Ayesha Khan: ఆ యాంగిల్స్ ఏంటి..? ఎక్కడ పడితే అక్కడ జూమ్ చేస్తారా..? మండిపడ్డ హీరోయిన్
Ayesha Khan
Rajeev Rayala
|

Updated on: Apr 06, 2024 | 7:38 AM

Share

హీరోయిన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కామనే.. కొంతమంది ముద్దుగుమ్మతో సోషల్ మీడియాలో తమ అందాలతో కుర్రాళ్ళ మతిపోగొడుతూ ఉంటారు. గ్లామర్ ఫోటోలను, వీడియోలను షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు ముద్దుగుమ్మలు. అయితే కొంతమంది కేటుగాళ్లు మాత్రం హీరోయిన్స్ ఫోటోలను మిస్ యూస్ చేస్తూ ఉంటారు. మొన్నీమధ్య డీప్ ఫేక్ వీడియోలు సెలబ్రెటీలకు లేనిపోని తలనొప్పులు తెచ్చిన విషయం తెలిసిందే. వేరే వారి హాట్ ఫోటోలకు, వీడియోలకు హీరోయిన్స్ ముఖాలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు. మరికొంతమంది హీరోయిన్ ఫోటోలను జూమ్ చేసి అసభ్యకరంగా ఎడిట్ చేయడం.. ప్రైవేట్ పార్ట్స్ ను జూమ్ చేసి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ కు ఇదే పరిస్థితి ఎదురైంది. తన ఫోటోలను జూమ్ చేసి షేర్ చేయడంతో ఫైర్ అయ్యింది. ఓ రేంజ్ లో మండి పడింది.

అయేషా ఖాన్..  మధ్యకాలంలో ఈ అమ్మడి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. స్పెషల్ సాంగ్ లో మెరుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. మొన్నీ మధ్య శ్రీవిష్ణు హీరోగా నటించిన ఓం భీం బుష్ సినిమాలో గ్లామరస్ రోల్ చేసి అందరిని అలరించింది ఈ చిన్నది. అదేవిధంగా మాస్ కా దాస్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో స్పెషల్ సాంగ్ లో అలరించింది. ఇటీవలే ఈ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటలో అయేషా ఖాన్ తన అందాలతో కుర్రాళ్ళ మతిపోగొట్టింది.

అయితే తాజాగా ఈ చిన్నదాని లేటెస్ట్ ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ ఫోటోలను కొంతమంది జూమ్ చేసి అసభ్యకరంగా చూపించారు అని ఫైర్ అయ్యింది. మీడియా వాళ్లు కావాలనే ఇలా జూమ్ చేసి ఫోటోలు తీశారు అని మండిపడింది. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది అయేషా ఖాన్. “అసలు ఆ యాంగిల్స్ ఏమిటి.? ఎక్కడెక్కడ జూమ్ చేస్తున్నారు.? అసలు ఎందుకు జూమ్ చేసి ఫోటోలు తీస్తున్నారు.? కొంతమంది మీడియా వాళ్లు ఎందుకు ఇలాంటి అసభ్యకర ఫోటోలు తీస్తున్నారు.? ఒక మహిళకు తన బట్టలు కూడా సర్దుకునే స్వేచ్ఛ లేదా.? ఇది చాలా అసహ్యంగా ఉంది. తన కారులో నుంచి ఓ అమ్మాయి దిగే ముందు తన బట్టలను సర్దుకుంటూ కనిపిస్తే.. ఆ ఫోటోలను కూడా మీరు క్యాప్చర్ చేసి పోస్ట్ చేయాలనుకుంటున్నారా? ఒక మహిళ తనను ఇలా పిచ్చి పిచ్చి ఫోటోలు తీయ్యొద్దు . మహిళలకు కనీస మర్యాద ఎలా ఇవ్వాలో మీరు నేర్చుకోండి అంటూ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చింది అయేషా ఖాన్.

Ayesha Khan

అయేషా ఖాన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్