Family Star Review: హిట్టా.? ఫట్టా.? విజయ్ దేవరకొండ ఈజ్ బ్యాక్ అనొచ్చా.?
ఆఫ్టర్ లైగర్.. పరుశురామ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఐరనే వంచాలనే చిన్న లైన్తో.. వెరీ ఇనీషియల్ స్టేజ్‌లోనే.. అందర్నీ తన వైపుకు తిప్పుకున్న ఈ ఫ్యామిలీ స్టార్.. తాజాగా థియేటర్లలోకి వచ్చేశాడు. మరి ఒకప్పటి గీతా గోవిందం సినిమాతో.. తాను క్రియేట్ చేసిన మ్యాజిక్‌ను రిపీట్ చేశాడా... లేదా.? అనేది తెలుసుకోవాలంటే వాచ్ దిస్ రివ్యూ..!
ఆఫ్టర్ లైగర్.. పరుశురామ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఐరనే వంచాలనే చిన్న లైన్తో.. వెరీ ఇనీషియల్ స్టేజ్‌లోనే.. అందర్నీ తన వైపుకు తిప్పుకున్న ఈ ఫ్యామిలీ స్టార్.. తాజాగా థియేటర్లలోకి వచ్చేశాడు. మరి ఒకప్పటి గీతా గోవిందం సినిమాతో.. తాను క్రియేట్ చేసిన మ్యాజిక్‌ను రిపీట్ చేశాడా… లేదా.? అనేది తెలుసుకోవాలంటే వాచ్ దిస్ రివ్యూ..!
ఓ మధ్య తరగతి కుటుంబం.. అందులో ముగ్గురు అన్నాదమ్ములు.. ఇద్దరు వదినలు.. వాళ్ల పిల్లలు.. ఓ బామ్మ.. ! వీళ్లందర్నీ ఒంటెద్దు బండిలా పోషించే గోవర్ధన్ అలియాస్ విజయ్ దేవరకొండ. పైగా కుటుంబం మీద ఈగ వాలినా కూడా ఊరుకోడు.. ఎవరైనా వేలెత్తి చూపిస్తే భరించలేడు. అలాంటి వాడి జీవితంలోకి సెంట్రల్ యూనివర్సిటీలో రీసెర్చ్ చేసే ఇందు అలియాస్ మృణాల్ థాకూర్ వస్తుంది. అంతా బానే ఉంది అనుకుంటున్న టైంకి ఇందు చేసిన ఓ పనికి గోవర్దన్ బాగా డిస్టర్బ్ అవుతాడు. ఆమెను ద్వేషించే వరకు వెళతాడు. అనుకుంటే మధ్య తరగతి వాడు సాధించలేనిది ఏదీ లేదని ఆమెను చూపించడానికి.. జగపతి బాబు రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగం చేరతాడు. అసలు ఇందుకు గోవర్దన్‌కు ఎందుకు చెడింది. ఇందు ద్వేషించేంత తప్పేం చేసింది. అనేది అసలు కథ.
కొన్ని సినిమాలు చూడ్డానికి రొటీన్‌గానే ఉంటాయి.. ఏంటబ్బా ఒకే కథను ఎన్నిసార్లు తీస్తారు అనిపిస్తుంది. కానీ అవే కథల్లో ఈజీగా కనెక్ట్ అయిపోయే ఓ చిన్న మ్యాజిక్ కూడా ఉంటుంది. ఫ్యామిలీ స్టార్ కూడా అలాంటి సినిమానే.. అలాంటి కథే. ఇదేం కొత్త కాదని దిల్ రాజే చెప్పాడు.. ఎన్నో సినిమాల్లో చూసిందే. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ.. దాన్ని ఒంటెద్దు బండిలా నడిపించే ఒక్కడు.. కుటుంబం జోలికి వస్తే ఎంత దూరమైనా వెళ్లే తెగింపు.. ఇదే ఫ్యామిలీ స్టార్ కథ. ఫస్టాఫ్ వరకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు.. ఫన్నీ మూవెంట్స్‌తో బాగానే వెళ్తుంది కథ. ఇంటర్వెల్ వరకు ఎమోషన్స్, కామెడీ అన్నీ బాగానే పండాయి. కుటుంబం జోలికి వచ్చినపుడు వచ్చే యాక్షన్ సీన్స్.. మృణాళ్ వచ్చాక వచ్చే సన్నివేశాలన్నీ ఆకట్టుకుంటాయి. కీలకమైన సెకండాఫ్ మాత్రం అక్కడక్కడా ట్రాక్ తప్పినట్లు అనిపించింది. స్లో నెరేషన్ కాస్త ఇబ్బంది పెడుతుంది. కానీ సెకండాఫ్ అమెరికా ఎపిసోడ్‌లో విజయ్ పంచులు వర్కవుట్ అయ్యాయి. వద్దన్నా అక్కడక్కడా గీతా గోవిందం రిఫరెన్సులు కనిపిస్తాయి.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కుటుంబాన్నే కాదు.. సినిమాను కూడా ఒక్కడే మోసాడు. రౌడీ బాయ్ ఉంటే.. పాత కథ కూడా కొత్తగానే అనిపిస్తుంది.. మనోడి స్క్రీన్ ప్రజెన్స్ అలా ఉంది. మృణాళ్ ఠాకూర్ బా చేసింది. మొదటి రెండు సినిమాల మాదిరే ఇందులో కూడా నటనతో ఆకట్టుకుంది. బామ్మ పాత్ర కూడా బాగుంది. ప్రభాస్ శీను, వెన్నెల కిషోర్ బానే నవ్విస్తారు. తన మ్యూజిక్ తో ఎప్పుడూ మ్యాజిక్ చేసే గోపీ సుందర్ … మ్యూజికల్ మ్యాజిక్ తగ్గింది. మునుపటి గీతాగోవిందాన్ని టచ్ చేయలేక పోయింది. ఎప్పటిలానే పరుశురామ్ మరో సారి తన డైలాగ్‌లో అందర్నీ చప్పట్లు కొట్టేల చేసుకున్నాడు. ఇక ఓవరాల్‌గా ఫ్యామిలీ స్టార్.. క్లీన్ ఎంటర్‌టైనర్.. ఓసారి కుటుంబంతో పాటు చూడొచ్చు.!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.