Ranveer Singh- Deepika Padukone: దీపికతో పెళ్లి ఫొటోలను డిలీట్ చేసిన రణ్‌వీర్ సింగ్.. కారణమిదేనా?
బాలీవుడ్ బ్యూటీ ఫుల్ కపుల్ రణవీర్ సింగ్ , దీపికా పదుకొణె త్వరలోనే అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందనున్నారు. దీపిక త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. అయితే ఈ శుభ తరుణంలో సడెన్ షాక్ ఇచ్చాడు రణ్‌వీర్ సింగ్. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ స్టార్ హీరో తన ఇన్‌స్టాగ్రామ్ నుండి..
బాలీవుడ్ బ్యూటీ ఫుల్ కపుల్ రణవీర్ సింగ్ , దీపికా పదుకొణె త్వరలోనే అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందనున్నారు. దీపిక త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. అయితే ఈ శుభ తరుణంలో సడెన్ షాక్ ఇచ్చాడు రణ్‌వీర్ సింగ్. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ స్టార్ హీరో తన ఇన్‌స్టాగ్రామ్ నుండి దీపికా పదుకొనేతో పెళ్లికి సంబంధించిన అన్ని ఫోటోలను తొలగించాడు. రణ్‌వీర్ సింగ్ ఇంత హఠాత్తుగా పెళ్లి ఫొటోలను తొలగించడం అభిమానులను సైతం షాక్‌కి గురిచేస్తోంది. రణవీర్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో మొత్తం 133 పోస్ట్‌లు ఉన్నాయి. అయితే దీపికాతో పెళ్లి ఫొటోలను మాత్రమే అతను తొలగించాడు. షాకింగ్ విషయం ఏమిటంటే, ఫోటోలు మాత్రమే కాదు, రణవీర్ సింగ్ అన్ని పెళ్లి వీడియోలను కూడా డిలీట్ చేశాడు. మరోవైపు దీపికా పదుకొణె ఇన్ స్టా గ్రామ్ లో మాత్రం పెళ్లి ఫొటోలు అలాగే ఉన్నాయి. దీంతో లేనిపోని అనుమానాలు తలెత్తుతున్నాయి. రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే మధ్య వాగ్వాదం జరిగిందని, అందుకే రణవీర్ సింగ్ పెళ్లి ఫోటోలను తొలగించాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే దీపిక ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. ఇలాంటి టైంలో విడాకులు అనేది నమ్మేలా అనిపించట్లేదని మరికొందరు తమ అభిప్రాయం వెల్లడిస్తున్నారు. బహుశా ఏదో పొరపాటు వల్ల పెళ్లి పిక్స్ కనిపించకుండా పోవడం అయ్యిండొచ్చని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంపై ఫుల్ క్లారిటీ రావాలంటే రణ్ వీర్ సింగ్ స్పందించాల్సిందే.
దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంట నవంబర్ 2018 లో ఇటలీలో వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ బాలీవుడ్‌లో పాపులర్ ఆర్టిస్టులుగా వెలుగొందుతున్నారు. ఇప్పుడు దీపిక త్వరలోనే ఒక పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఇంతలోనే రణ్ వీర్ పెళ్లి ఫొటోలు, వీడియోలను డిలీట్ చేయడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. రణ్‌వీర్ సింగ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. అతని ఇన్‌స్టాగ్రామ్ ఖాతా చూసిన అభిమానులు ఆశ్చర్యపోయారు. జనవరి 2023 కంటే ముందు ఫోటోలు అతని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కనిపించడం లేదు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రణవీర్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో దీపికాతో కలిసున్న ఇతర ఫోటోలు కూడా ఉన్నాయి. కాబట్టి వారి మధ్య మనస్పర్థలు ఉన్నాయని వాదించుకోవడంలో అర్థం లేదని నెటిజన్లు అంటున్నారు. సాంకేతిక కారణాల వల్ల పాత ఫోటోలు కనిపించడం లేదని అభిమానులు అంటున్నారు
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.