Actress Hema: బెంగుళూరు డ్రగ్స్ కేస్‌లో నటి హేమకు ఊరట.
కొన్ని నెలల క్రితం బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ప్రముఖ టాలీవుడ్ నటి హేమ పట్టుబడినట్లు అక్కడి పోలీసులు ప్రకటించడం టాలీవుడ్ లో తీవ్ర కలకలం రేపింది. ఆమె డ్రగ్స్ సేవించిందని, టెస్ట్ రిపోర్ట్ లో కూడా పాజిటివ్ గా వచ్చిందంటూ పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. ఆ తర్వాత విచారణకు వచ్చిన నటిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
బెంగుళూరు డ్రగ్స్ కేస్ లో నటి హేమ కు ఊరట. హేమ పై నమోదైన కేసులో స్టే విధించింది బెంగళూరు హై కోర్ట్. గత ఏడాది హేమా పై బెంగళూరులో రేవ్ పార్టీ కేస్ నమోదైన విషయం తెలిసిందే. తన పై నమోదైన డ్రగ్స్ కేస్ కొట్టివేయ్యాలని పిటిషన్ దాఖలు చేశారు హేమ. ఇప్పటికే ఆమె పై బెంగుళూరు పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. తాను డ్రగ్స్ సేవించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పిటిషన్ లో పేర్కొన్నారు హేమా. అంతే కాదు ఈ కేసులో గతంలో అరెస్ట్ కూడా అయ్యారు. తాజాగా డ్రగ్స్ కేస్ లో నటి హేమ కు ఊరట లభించింది.