SSMB 29: మహేష్ బాబు,రాజమౌళి మూవీ షురూ.. ముహూర్తానికి హాజరైన సూపర్ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల విజయం తర్వాత జక్కన మరోసారి భారీ బడ్జెట్ సినిమాను రూపొందించేందుకు సిద్ధమయ్యాడు.

SSMB 29: మహేష్ బాబు,రాజమౌళి మూవీ షురూ.. ముహూర్తానికి హాజరైన సూపర్ స్టార్
Maheshbabu, Rajamouli
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 02, 2025 | 12:37 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి సినిమా కోసం అభిమానులంతా వెయ్యికళ్లతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక మహేష్ ఫ్యాన్స్ కూడా గుంటూరు కారం సినిమాతో నిరాశపడ్డారు. దాంతో రాజమౌళి సినిమా పై ఆశలు పెట్టుకున్నారు. రాజమౌళి సినిమా కాబట్టి ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. కానీ ఏ రేంజ్ లో హిట్ అవుతుంది.? కథ ఎలా ఉండబోతుంది.? మహేష్ బాబు ఎలా కనిపించనున్నాడు.? అని అభిమానులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తాజాగా మహేష్ బాబు , రాజమౌళి సినిమా పూజా కార్యక్రమం స్టార్ట్ అయ్యింది.

రెండేళ్ల మహేష్ బాబు అభిమానులు ఎదురు చూపులకు సమాధానం. మహేష్ బాబు, రాజమౌళి సినిమా అధికారికంగా లాంఛ్ అయ్యింది. హైదరాబాద్ శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ముహూర్తానికి   మహేష్ బాబు హాజరయ్యారు. సాధారణంగా తన సినిమా ఓపెనింగ్స్ కు దూరంగా ఉండే మహేష్.. రాజమౌళి కోసం సెంటిమెంట్ పక్కన పెట్టారు. యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా SSMB29 సినిమా ఉండనుంది.

ఆఫ్రికా సహా ప్రపంచంలోని పలు దేశాలలో SSMB29 చిత్రీకరణ కోసం ఏర్పాట్లు చేశారు దర్శకుడు రాజమౌళి. అలాగే ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నికల్ టీం కూడా పని చేయనున్నారు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ అంటూ ప్రచారం జరుగుతుంది. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ నిర్మాతగా  మహేష్, రాజమౌళి సినిమా తెరకెక్కుతుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఇప్పటికే లొకేషన్స్ ఫైనల్ చేసిన చేశారు రాజమౌళి టీమ్. ఈ సినిమా 2027లో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. అలాగే గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సిడ్నీ టెస్ట్.. మూడో రోజు బుమ్రా బరిలోకి దిగుతాడా? అప్డేట్ ఇదిగో
సిడ్నీ టెస్ట్.. మూడో రోజు బుమ్రా బరిలోకి దిగుతాడా? అప్డేట్ ఇదిగో
సీతమ్మవారిని ముక్కుతో పొడిచిన ఫలితం.. కాకికి రాములవారి శాపం
సీతమ్మవారిని ముక్కుతో పొడిచిన ఫలితం.. కాకికి రాములవారి శాపం
ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి..కర్నూలు వేదికగా ఒక్కటైన ప్రేమ జంట
ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి..కర్నూలు వేదికగా ఒక్కటైన ప్రేమ జంట
కొత్త ఏడాదిలో గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..
కొత్త ఏడాదిలో గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..
నేడే ఏథర్ 450 నయా వెర్షన్ రిలీజ్.. ఆకట్టుకునేలా సూపర్ ఫీచర్లు
నేడే ఏథర్ 450 నయా వెర్షన్ రిలీజ్.. ఆకట్టుకునేలా సూపర్ ఫీచర్లు
చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!
చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!
ఇక చాయ్‌, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!
ఇక చాయ్‌, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!
ఉబర్ క్యాబ్‌ను వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..
ఉబర్ క్యాబ్‌ను వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..
ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ బ్యూటీ.. క్లారిటీ ఇచ్చిన టీం.
ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ బ్యూటీ.. క్లారిటీ ఇచ్చిన టీం.
సంక్రాంతికి వేళ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌
సంక్రాంతికి వేళ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌