Pushpa 2: పుష్ప2 మూవీ మేకర్స్‌కు ఊరట.. తమ పరిధి కాదు అని వాదన

పుష్పా 2 ప్రొడ్యూసర్లు ఎలమంచిలి రవిశంకర్ మరియు నవీన్ యెర్నేని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో, హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన విషాదకర ఘటనకు సంబంధించి తమపై నమోదైన కేసును రద్దు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. హైకోర్టు ఈ కేసును పరిశీలించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Pushpa 2: పుష్ప2 మూవీ మేకర్స్‌కు ఊరట.. తమ పరిధి కాదు అని వాదన
Pushpa
Follow us
Vijay Saatha

| Edited By: Rajeev Rayala

Updated on: Jan 02, 2025 | 12:46 PM

పుష్పా 2 సినిమా విడుదల సందర్భంగా, సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన పై హై కోర్టు లో పిటిషన్ లు పడుతూనే ఉన్నాయి … ఘటన తర్వాత, థియేటర్ భద్రతలో లోపాలపై ప్రశ్నలు ఎదరయ్యాయి. ఈ నేపథ్యంలో, ప్రొడ్యూసర్లను కూడా బాధ్యులుగా పేర్కొంటూ కేసు నమోదైంది.వారిని సైతం పోలీసులు ఈ కేస్ లో నిందితులుగా చేర్చారు.ఇప్పటికే ఈ కేస్ లో సంధ్య థియేటర్ యాజమాన్యం తో పాటు సినిమా యూనిట్ , సినిమా హీరో ను నిందితుల జాబితా లో చేర్చారు.దీని పై ఇప్పటికే చాలా మంది నిందితులు హై కోర్టు ను ఆశ్రయించారు.పలువురికి ఊరట కూడా లభించింది.తాజాగా సినిమా ప్రొడ్యూసర్ లకు హై కోర్ట్ లో ఊరట లభించింది.

థియేటర్ భద్రత నిర్వహణ తమ బాధ్యత కాదని స్పష్టంగా పేర్కొన్నారు. అభిమానుల భారీగుమికూడింపు ఉంటుందని ముందుగానే పోలీసులకు సమాచారం అందించామని వివరించారు.అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ, అనుకోని విధంగా ఈ ఘటన జరిగింది. విడుదలకు ముందు నుంచే అభిమానుల సౌకర్యానికి అన్ని ఏర్పాట్లు చేయించామని న్యాయవాది కోర్ట్ కు వివరించారు.జరిగిన దుర్ఘటనకు తమను నేరపూరితంగా బాధ్యులుగా చేస్తే, అది న్యాయసమ్మతం కాదని వాదించారు.

ఈ కేసులో పోలీసులు ప్రొడ్యూసర్లపై కొన్ని అభియోగాలు నమోదు చేశారు. వారి అభిప్రాయం ప్రకారం, థియేటర్ వద్ద జరిగిన భద్రతా లోపాలకు చిత్ర యూనిట్ కూడా బాధ్యత వహించాలని పేర్కొన్నారు.ప్రొడ్యూసర్ల అరెస్టును తాత్కాలికంగా నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.కేసు సంబంధించి పోలీసులు తమ వాదనలను కౌంటర్ రూపంలో సమర్పించాలని ఆదేశించింది.తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.ఈ తీర్పు ప్రొడ్యూసర్లకు తాత్కాలిక ఊరట అందించినప్పటికీ, పోలీసుల కౌంటర్ నివేదిక, తదుపరి విచారణ కీలకంగా మారనుంది. సినీ పరిశ్రమలో ఈ కేసు భవిష్యత్తులో విడుదలల నిర్వహణ, భద్రతా ప్రోటోకాల్స్‌పై కొత్త మార్గదర్శకాలను తీసుకురావచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.