చేసిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ హాట్‌నెస్ కేరాఫ్ అడ్రస్.. ఎవరో గుర్తుపట్టారా.?
సినీ సెలబ్రెటీల ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం పదుల సంఖ్యలో వైరల్ అవుతూ ఉంటాయి. సినీ సెలబ్రెటీలకు సంబందించిన ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తూ ఉంటారు. చాలామంది తమ అభిమాన హీరోల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఓ క్రేజీ హీరోయిన్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది.
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ కొంతమంది భామలకు అదృష్టం కలిసి రాదు. ఎన్ని సినిమాలు చేసినా అవి ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో మాత్రం క్రేజీ ఫోటోలు, వీడియోలతో ప్రేక్షకులను కవ్విస్తున్నారు. పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ కూడా అంతే.. చేసిన సినిమాలన్నీ డిజాస్టర్స్ కానీ అమ్మడి ఫాలోయింగ్ చూస్తే మతిపోవాల్సిందే. ఈ బ్యూటీ చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను నిరాశపరిచాయి.. కానీ క్రేజ్ మాత్రం కేక. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? అందంలో తనకు తానే సాటి.. పరువాలతో కుర్రకారును తన వలలో వేస్తుంది ఈ కుర్రాది.
గ్లామర్ తో కుర్రకారును కట్టిపడేస్తున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? తొలి సినిమాతోనే అభిమానులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రియా ప్రకాష్ వారియర్. ఒకేఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిన ముద్దుగుమ్మల్లో ప్రియా ప్రకాష్ వారియర్ ఒకరు. ఈ క్రేజీ బ్యూటీ సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కుగా బిజీగా గడిపేస్తోంది. చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి క్రేజ్ తెచ్చుకుంది. కేవలం ఒక్క వీడియో క్లిప్‌తో రాత్రికి రాత్రే పాపులర్ అయ్యింది ప్రియా ప్రకాష్ వారియర్. కన్ను కొట్టి కుర్రకారును కట్టిపడేసింది. ఓరు ఆధార్ లవ్ అనే సినిమాతో పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. కానీ ప్రియా ప్రకాష్ కు మంచి క్రేజ్ వచ్చింది.
ఆతర్వాత మలయాళంలో వరుసగా సినిమాలు చేసింది. ఇక తెలుగులో నితిన్ హీరోగా నటించిన చెక్ అనే సినిమాతో అడుగు పెట్టింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. కేరళకు చెందిన ఈ బ్యూటీ మలయాళ సినిమాలతో పాటు తెలుగు, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తోంది. మొన్నామధ్య పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమాలో చేసింది. కానీ హీరోయిన్ గా కాదు. తేజ్ సిస్టర్ గా కనిపించింది ఈ భామ. ఈ సినిమా తర్వాత మరో సినిమా ఓకే చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటోంది. హాట్ ఫోటోలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది ఈ చిన్నది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్ళ మతి పోగొడుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.