AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కలెక్షన్స్‌లో బెల్లంకొండ దూకుడు..ఈ సారి సాలిడ్ హిట్ షురూనా?

ఇండస్ట్రీకి వచ్చింది మొదలు హిట్టు కోసం పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం చేస్తున్నాడు బెల్లకొండ శ్రీనివాస్. మొదట్లో మాంచి మాసీవ్ సబ్జెక్ట్స్ సెలక్ట్ చేసుకోని..భారీ బడ్జెట్ పిక్చర్స్‌లో యాక్ట్ చేసిన శ్రీనివాస్..మాసీవ్ హిట్‌ను కాకపోయినా, మంచి మాస్ ఫ్యాన్ బేస్‌ను వెనుకేసుకున్నాడు. అదే ఇప్పుడు అతనికి కలిసొచ్చింది. ప్రస్తుతం హై బడ్జెట్, భారీ హంగులతో కాకుండా మీడియమ్ బడ్జెట్‌లో మంచి సినిమాల కోసం ప్రయత్నిస్తున్నాడు. తాజాగా నటించిన ‘రాక్షసుడు’ సినిమా కూడా అందులో భాగమే. ఈ చిత్రానికి ఇప్పుడు […]

కలెక్షన్స్‌లో బెల్లంకొండ దూకుడు..ఈ సారి సాలిడ్ హిట్ షురూనా?
Ram Naramaneni
| Edited By: |

Updated on: Aug 03, 2019 | 5:33 PM

Share

ఇండస్ట్రీకి వచ్చింది మొదలు హిట్టు కోసం పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం చేస్తున్నాడు బెల్లకొండ శ్రీనివాస్. మొదట్లో మాంచి మాసీవ్ సబ్జెక్ట్స్ సెలక్ట్ చేసుకోని..భారీ బడ్జెట్ పిక్చర్స్‌లో యాక్ట్ చేసిన శ్రీనివాస్..మాసీవ్ హిట్‌ను కాకపోయినా, మంచి మాస్ ఫ్యాన్ బేస్‌ను వెనుకేసుకున్నాడు. అదే ఇప్పుడు అతనికి కలిసొచ్చింది.

ప్రస్తుతం హై బడ్జెట్, భారీ హంగులతో కాకుండా మీడియమ్ బడ్జెట్‌లో మంచి సినిమాల కోసం ప్రయత్నిస్తున్నాడు. తాజాగా నటించిన ‘రాక్షసుడు’ సినిమా కూడా అందులో భాగమే. ఈ చిత్రానికి ఇప్పుడు అద్భుతమైన టాక్ వచ్చింది. రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం తమిళనాట హిట్ అయిన రాచ్చసన్ సినిమాకు రీమేక్. దీనికి తొలిరోజే మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా జోరుమీదున్నాయి.

తొలిరోజే తెలుగు రాష్ట్రాల్లో 1.96 కోట్ల షేర్ తీసుకొచ్చాడు ఈ యంగ్ హీరో.. ఓవర్సీస్ నుంచి మరో 30 లక్షలు కలెక్ట్ చేశాడు. మొత్తంగా తొలిరోజు 2.5 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చాడు. సినిమాకు టాక్ బాగుంది కాబట్టి కచ్చితంగా శని, ఆదివారాల్లో ఇంకా మంచి వసూళ్లు వస్తాయని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. సస్పెన్స్  క్రైమ్ థ్రిల్లర్‌కు ఏ సెంటర్స్‌లో మంచి ఆదరణ ఉంటుంది. ఇక బీ, సీ సెంటర్లలో శ్రీనివాస్‌కు సపరేట్ మార్కెట్  ఉంది కాబట్టి వీకెండ్‌లో కలెక్షన్స్‌కి బాధ ఉండదు. సినిమా సేఫ్ కావాలంటే 14 కోట్లు కావాలి. కాకపోతే పైరసీనే సినిమాను వెంటాడుతోంది. టాక్ ప్రకారం చూస్తుంటే ఈ సారి బెల్లంకొండ బాబు హిట్ కొట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!