Bellamkonda Sreenivas: శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న బెల్లంకొండ ‘ఛత్రపతి’ రీమేక్..
అల్లుడు శీను సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు యంగ్ హీరో బెల్లం కొండా సాయి శ్రీనివాస్.. మొదటి సినిమానే యాక్షన్ డైరెక్టర్ వి వినాయక్ తో చేశారు ఈ కుర్ర హీరో.
Bellamkonda Sreenivas: అల్లుడు శీను సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు యంగ్ హీరో బెల్లం కొండా సాయి శ్రీనివాస్.. మొదటి సినిమానే యాక్షన్ డైరెక్టర్ వి వినాయక్ తో చేశారు ఈ కుర్ర హీరో. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించగా స్పెషల్ సాంగ్ లో తమన్నా మెరిసింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు ఈ యంగ్ హీరో.. అయితే సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేక పోయాడు. ఆతర్వాత తమిళ్ సినిమాకు రీమేక్ గా వచ్చిన రాక్షసుడు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత అయినా హిట్ సినిమాలు పడతాయనుకుంటే మళ్ళీ యధాతదం.. దాంతో బాలీవుడ్ కు చెక్కేస్తున్నాడు బెల్లంకొండ హీరో. తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాను అక్కడ రీమేక్ చేస్తున్నాడు.
తెలుగులో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నాడు ఈ బెల్లంకొండ హీరో.. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి చాలా కాలమే అవుతుంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. దాంతో ఈ సినిమా పై రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా ఈ సినిమానుంచి ఓ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం విశాఖపట్నంలో షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమా. ఈ మేరకు షూటింగ్ స్పాట్ నుంచి ఓ ఫోటోను షేర్ చేశారు. ఇక రీమేక్ కోసం రాజమౌళి మరియు విజయేంద్ర ప్రసాద్‌లు సాయం చేశారు. వారి సలహాలు మరియు సూచనలతో కథను హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్చారు.
మరిన్ని ఇక్కడ చదవండి :