ఆ కంపెనీపై నాగ్ ఆగ్రహం… ప్రొడక్ట్స్ కొనేటప్పుడు జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేసిన టాలీవుడ్ కింగ్…
టాలీవుడ్ కింగ్ నాగార్జునకు కోపమొచ్చింది... ఆ కంపెనీ వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్త అంటు బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు.
టాలీవుడ్ కింగ్ నాగార్జునకు కోపమొచ్చింది… ఆ కంపెనీ వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్త అంటు బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు. ఆ సంస్థ వస్తువులు, ఆ సంస్థ స్టోర్లు మీమ్మల్ని మోసం చేస్తాయని జాగ్రత్త చెబుతున్నాడు. ఇంతకీ నాగ్‌కు కోపమెందుకొచ్చిందంటే…
BE CAREFUL When you buy Apple products from Apple store India… Their service and policies are one sided and terrible!! ?@Apple @AppleSupport
— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 9, 2020
నాగ్ తాజాగా ట్విట్టర్ వేదికగా ఆపిల్ కంపెనీపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆపిల్ కంపెనీ వస్తువులను ఆపిల్ స్టోర్ నుంచి కొనేటప్పుడు జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఆపిల్ కంపెనీ సర్వీసు బాలేదని, వారి నిబంధనలు భయంకరంగా, ఏకపక్షంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపిల్, ఆపిల్ సపోర్ట్‌ను ట్యాగ్ చేస్తూ… ట్విట్టర్ వేదికగా నాగ్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.