AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandla Ganesh: బండ్ల గణేష్‌కు కాబోయే అల్లుడు ఎవరు, ఏం చేస్తారో తెలుసా? బ్యాక్‌గ్రౌండ్ డీటెయిల్స్ ఇవే

టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఇంట్లో త్వరలో శుభకార్యం జరగనుంది. ఆయన కూతురు జనని త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. ఈ శుభవార్తను బండ్ల గణేషే సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో బండ్లన్నకు కాబోయే అల్లుడి గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Bandla Ganesh: బండ్ల గణేష్‌కు కాబోయే అల్లుడు ఎవరు, ఏం చేస్తారో తెలుసా? బ్యాక్‌గ్రౌండ్ డీటెయిల్స్ ఇవే
Bandla Ganesh Family
Basha Shek
|

Updated on: Apr 05, 2026 | 11:17 AM

Share

టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ కూతురు జనని త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. సూర్యతేజ చిలుకూరి అనే అబ్బాయితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనుంది. ఈ శుభవార్తను స్వయంగా బండ్ల గణేశ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. జనని వివాహానికి సంబంధించిన కార్యక్రమాలు ఇప్పటికే మొదలైపోయాయి. ఇటీవలే పసుపు- కుంకుమా కార్యక్రమాన్ని బండ్ల గణేశ్ ఇంట్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో బండ్ల గణేశ్ ఫ్యామిలీతో పాటు ఆయనకు కాబోయే వియ్యంకుల కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. . ‘శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. ఆ దేవుడి ఆశీస్సులు, మా పెద్దల దీవెనలతో త్వరలో మా ఇంట్లో జరగబోయే శుభకార్యం. చిరంజీవి ‘సూర్యతేజ చిలుకూరి’ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ‘జనని బండ్ల’ల వివాహా సందర్భంగా ‘పసుపు కుంకుమ కార్యక్రమం’ నిర్వహించాం’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు బండ్లన్న. ఇందులో బండ్లన్నకు కాబోయే అల్లుడితో పాటు వియ్యంకుల ఫొటోలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు బండ్ల గణేశ్‌ కుటుంబానికి, అలాగే కాబోయే వధూవరులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదే సమయంలో బండ్లన్న కాబోయే అల్లుడు ఎవరు, ఏం చేస్తాడు? వారి వియ్యంకుల ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ డీటెయిల్స్ ఏంటన్న వివరాలపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

కాగా బండ్ల గణేష్ వియ్యంకుడి కుటుంబానికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే బండ్లన్నకు కాబోయే అల్లుడు చిలుకూరి సూర్య తేజకు కోట్లలో విలువ చేసే ఆస్తులు ఉన్నాయని సమాచారం. అయితే సూర్యతేజ చిలుకూరి వ్యక్తిగత వివరాలు, ప్రొఫెషనల్ బ్యాక్‌గ్రౌండ్ వంటి అంశాలు ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. ఆయన ఉద్యోగం చేస్తున్నారా? లేక రియల్ ఎస్టేట్ లోనే ఉంటున్నారా? లేదా మరేదైనా వ్యాపారంలో స్థిరపడ్డారా అనేది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

ఇక బండ్ల గణేశ్ విషయానికి వస్తే..కమెడియన్ గా, సహాయక నటుడిగా, నిర్మాతగా సక్సెస్ అయ్యారు. అయితే చాలా రోజులుగా ఆయన సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయినా తన ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్టులతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ఓ సినిమాలో బండ్లన్న ఓ కీలక పాత్ర పోషించునున్నట్లు తెలుస్తోంది.

కాబోయే అల్లుడితో బండ్ల గణేశ్..

Bandla Ganesh Family

Bandla Ganesh Family

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!