AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: వారికి సదా రుణపడి ఉంటాను.. పద్మ భూషణ్ అవార్డ్ పై స్పందించిన బాలకృష్ణ..

సినీరంగానికి చేసిన సేవలకు గానూ అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుటికే ఆయనకు సినీ ప్రముఖులు, అభిమాములు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా దీనిపై బాలయ్య స్పందిస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

Balakrishna: వారికి సదా రుణపడి ఉంటాను.. పద్మ భూషణ్ అవార్డ్ పై స్పందించిన బాలకృష్ణ..
Rajitha Chanti
|

Updated on: Jan 26, 2025 | 12:40 PM

Share

పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ థ్యాంక్స్ చెప్పారు. సుదీర్ఘ ప్రయాణంలో తనతో పాటు పాలు పంచుకున్న నటించిన నటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు బాలకృష్ణ. అభిమానులు, ఆధారాభిమానం చూపిస్తున్న ప్రేక్షక లోకానికి రుణపడి ఉంటానన్నారు బాలకృష్ణ. ఈ సందర్భంగా తోటి పద్మ అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారాయన.

50 ఏళ్లుగా సినీ రంగంలో సేవలు బాలకృష్ణ సేవలకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 109 చిత్రాల్లో నటించిన బాలకృష్ణ.. హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్‌ విజయం సాధించారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్‌గా సేవలందిస్తున్నారు బాలకృష్ణ.

“కృతజ్ఞతాభివందనాలు, నాకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా, ఈ అవార్డు ప్రకటించిన భారత ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ నా ధన్యవాదాలు. నా ఈ సుధీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్లకు, కుటుంబ సభ్యులకు మరియు యావత్ చలనచిత్ర రంగానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా తండ్రిగారైన స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుండి ఆయన వారసుడిగా నేటి వరకు నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న నా అభిమానులకు, నాపై తమ విశేష ఆధారాభిమానాలు కురిపిస్తున్న అశేష ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉండగలనని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నాతోటి పద్మ అవార్డు గ్రహీతలందరికీ కూడా నా అభినందనలు అందిస్తున్నాను. అప్పుడు… ఇప్పుడు… ఎల్లప్పుడూ… సదా మీ నందమూరి బాలకృష్ణ” అంటూ ట్వీట్ చేశారు.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..

Follow Us
బంగారం ధర ప్రతిరోజూ ఎందుకు మారుతుంది.. ధరను ఎవరు నిర్ణయిస్తారు?
బంగారం ధర ప్రతిరోజూ ఎందుకు మారుతుంది.. ధరను ఎవరు నిర్ణయిస్తారు?
ఆయన నా ఇంటికి వచ్చే ఆ వేషం వేయకు అని చెప్పాడు..
ఆయన నా ఇంటికి వచ్చే ఆ వేషం వేయకు అని చెప్పాడు..
వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. ఒక్కసారిగా చుట్టుముట్టారు.. ఆ తర్వత
వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. ఒక్కసారిగా చుట్టుముట్టారు.. ఆ తర్వత
ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్ అద్దెకి తీసుకున్న టీ20 కెప్టెన్
ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్ అద్దెకి తీసుకున్న టీ20 కెప్టెన్
భార్యతో సన్నిహితంగా కనిపించిన డ్రైవర్.. ఆ తర్వాత ఏంజరిగిందంటే
భార్యతో సన్నిహితంగా కనిపించిన డ్రైవర్.. ఆ తర్వాత ఏంజరిగిందంటే
వార్నీ.. మరీ అంత తక్కువా.. 1960లో బంగార ధర తెలిస్తే..
వార్నీ.. మరీ అంత తక్కువా.. 1960లో బంగార ధర తెలిస్తే..
మస్క్‌ మామా మజాకా..? ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌..!
మస్క్‌ మామా మజాకా..? ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌..!
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా దూరం
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా దూరం
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..