AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chennakesava Reddy: బాలయ్య వంతు వచ్చేసింది.. రీరిలీజ్‌కు రెడీ అవుతున్న ‘చెన్నకేశవ రెడ్డి’

ప్రస్తుతం టాలీవుడ్‌లో నయా ట్రెండ్  రీరిలీజ్.. హీరోల బర్త్ డేలకు సూపర్ హిట్ సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు మేకర్స్.

Chennakesava Reddy: బాలయ్య వంతు వచ్చేసింది.. రీరిలీజ్‌కు రెడీ అవుతున్న 'చెన్నకేశవ రెడ్డి'
Chennakesava Reddy
Rajeev Rayala
|

Updated on: Sep 23, 2022 | 11:36 AM

Share

ప్రస్తుతం టాలీవుడ్‌లో నయా ట్రెండ్  రీరిలీజ్.. హీరోల బర్త్ డేలకు సూపర్ హిట్ సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు మేకర్స్. సూపర్ స్టార్ మహేష్ మొదలు పెట్టిన ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతోంది. మహేష్ పుట్టిన రోజు సందర్భంగా పోకిరి, ఒక్కడు సినిమాలు రీరిలీజ్ చేశారు. ఈ సినిమాలు రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టాయి. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా జల్సా, తమ్ముడు సినిమాలను రిలీజ్ చేశారు. ఈ సినిమాకూడా భారీ వసూళ్లు రాబట్టాయి. ఇక ఇప్పుడు బాలయ్య వంతు వచ్చేసింది. గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ ‘చెన్నకేశవ రెడ్డి’(Chennakesava Reddy) థియేటర్స్ లో మాస్ జాతర సృష్టించిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ దర్శకుడు వివి.వినాయక్ దర్శకత్వంలో సెప్టెంబర్ 25, 2002లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది.  ‘చెన్నకేశవ రెడ్డి’ మాస్ జాతర ఖండాంతరాలు దాటి 20 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ఏ మాత్రం క్రేజ్ తగ్గని ఈ చిత్రాన్ని ఇప్పుడు సరికొత్త హంగులతో రీరిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాత బెల్లం కొండ సురేష్. ఈ నేపధ్యంలో నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 24న ప్రిమియర్ షోలతో మొదలుపెట్టి, 25న రెగ్యులర్ షోలు వుంటాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 300 థియేటర్స్ లో సినిమాని ప్రదర్శిస్తున్నాం..ఈ  సినిమాని సరికొత్తగా డిఐతో పాటు 5. 1 హంగులతో తీర్చిదిద్దాం. ఈ సినిమాకి వచ్చే రెవెన్యూలో 75 శాతం బాలకృష్ణ గారి బసవతారకం ట్రస్ట్ కి, మిగతాది నాకు సంబధించిన అసోషియేషన్స్ కి ఇవ్వాలని నిర్ణయించాం అన్నారు.

దర్శకుడు వివి.వినాయక్ తో కలసి విలేఖరుల సమవేశం నిర్వహించి రీరిలీజ్ విశేషాలని పంచుకున్నారు. వివి వినాయక్ మాట్లాడుతూ.. కొన్నిసార్లు అనుకోకుండా ఆనందం వస్తుంది. అలాంటి ఆనందం ఇచ్చింది ‘చెన్నకేశవ రెడ్డి’. ఈ సినిమా షూటింగ్ చేస్తున్నపుడు కొన్నిగంటలు మాత్రమే నిద్రపోయాను. బాలయ్య గారిని ఎలా ప్రజంట్ చేయాలనే పిచ్చితోనే వుండేవాడిని. అప్పటికి రెండో సినిమానే చేస్తున్న నాకు బాలయ్య గారు ఎంతో మర్యాద ఇచ్చారు. ఆయన మర్యాద మర్చిపోలేను. ఈ సినిమాకి పని చేసినందరికీ పేరుపేరున కృతజ్ఞతలు. బాలయ్య గారితో పని చేయడం మర్చిపోలేని అనుభూతి. బాలయ్య బాబు గారికి ఎన్నో సూపర్ హిట్లు వున్నాయి. కానీ ఈ సినిమాని ఎక్కువగా ఓన్ చేసుకున్న బాలయ్య బాబు అభిమానులకు కృతజ్ఞతలు. ఈ సినిమానే రీరిలీజ్ చేయాలని అభిమనులు పట్టుబట్టారు. చాలా మంచి ఉద్దేశం కోసం ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమాలో వచ్చే మేజర్ రెవెన్యు బసవతారకం ట్రస్ట్ కి విరాళంగా ఇస్తున్నాం. ఇరవై ఏళ్ల క్రితం ఒక పండగలా ఈ సినిమాని విడుదల చేశాం. ఇప్పుడు కూడా రీరిలీజ్ లా లేదు. కొత్త సినిమా రిలీజ్ చేసినట్లే అనిపిస్తుంది. మంచి ఉద్దేశం కోసం రీరిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు, అభిమానులు ఆదరించాలి” అని కోరారు వినాయక్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి