AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhanda 2: బాలయ్య ‘అఖండ 3’ కూడా వచ్చేస్తోంది.. టైటిల్ అద్దిరిపోయిందంతే.. నిర్మాతల అధికారిక ప్రకటన

నందమూరి అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తోన్న క్షణం రానే వచ్చింది. బాలయ్య నటించిన ది మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ 2 తాండవం శుక్రవారం (డిసెంబర్ 12) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇక సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు.

Akhanda 2: బాలయ్య 'అఖండ 3' కూడా వచ్చేస్తోంది.. టైటిల్ అద్దిరిపోయిందంతే.. నిర్మాతల అధికారిక ప్రకటన
Balakrishna Akhanda 2 Movie
Basha Shek
|

Updated on: Dec 12, 2025 | 6:22 PM

Share

నందమూరి బాలకృష్ణ సినిమా వచ్చిందంటే అభిమానులకు పండగే. ప్రస్తుతం థియేటర్లలో అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. బాలయ్య హీరోగా నటించిన అఖండ 2 తాండవం శుక్రవారం (డిసెంబర్ 12) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో వచ్చిన అఖండ సినిమాకు ఇది సీక్వెల్. బోయపాటి శీను తెరకెక్కించిన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ముఖ్యంగా బాలయ్య నటనకు అభిమానులందరూ ఫిదా అవుతున్నారు. ఆయన చేసి యాక్షన్ సీక్వెన్సులు, పలికిన డైలాగులతో సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా అఖండ నామసమ్మరణే వినిపిస్తోది. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ‘అఖండ 2’ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. ఇక సినిమా చూసిన అభిమానులకు చిత్రబృందం ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ సిరీస్‌లో మూడో భాగం కూడా రాబోతున్నట్లు హింట్ ఇచ్చింది. ‘జై అఖండ’ పేరుతో ‘అఖండ 3’ ఉంటుందని సినిమా చివర్లో ప్రకటించారు. దీంతో నందమూరి అభిమానుల ఆనందం మరింత రెట్టింపయ్యింది. అఖండ2 లోనే రుద్ర తాండవం చూపించిన బాలయ్య జై అఖండ లో ఇంకెంత పవర్ ఫుల్ గా కనిపిస్తారోనని అభిమానులు అప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు.

అఖండ 2 సినిమా విషయానికి వస్తే.. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. సంయుక్త మేనన్ కథానాయికగా కనిపించింది. అలాగే బజ్ రంగీ బాయిజాన్ ఛైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలీ హర్షాలి మల్హోత్రా మరో కీలక పాత్రలో మెరిసింది. వీరితో పాటు ఆది పిని శెట్టి, కబీర్ సింగ్, రచ్చ రవి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ అచంట నిర్మించిన ఈ సినిమాకు బాలయ్య కూతురు తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరించడం విశేషం. ఇక నందమూరి తమన్ అందించిన స్వరాలు, బీజీఎమ్ అఖండ 2 సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాయని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

అఖండ 2 థియేటర్ల వద్ద బాలయ్య అభిమానుల కోలాహలం.. వీడియో

బాలయ్య అఖండ 2 సినిమాపై స్వామీజీ రివ్యూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.
గ్రహాల రాజు మారుతున్నాడు.. ఆ రాశులకు జాక్ పాట్!
గ్రహాల రాజు మారుతున్నాడు.. ఆ రాశులకు జాక్ పాట్!
Bedi Hanuman Temple: హనుమంతుడ్ని గొలుసులతో బంధించింది ఎవరు?
Bedi Hanuman Temple: హనుమంతుడ్ని గొలుసులతో బంధించింది ఎవరు?
ఇన్యూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ విషయాలు తెలుసుకోకపోతే బొక్కబోర్లా
ఇన్యూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ విషయాలు తెలుసుకోకపోతే బొక్కబోర్లా
వందే భారత్ రైళ్లపై మరో బిగ్ అప్డేట్ ఇచ్చిన రైల్వేశాఖ
వందే భారత్ రైళ్లపై మరో బిగ్ అప్డేట్ ఇచ్చిన రైల్వేశాఖ