AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Fry-Special Rice:అరగంటలో చేసుకోగలిగే స్పెషల్ చికెన్ ఫ్రై- స్పెషల్ రైస్.. తింటే అదిరిపోతది అంతే..

ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్టులు వస్తున్నారంటే చాలు, మన ఇంట్లో హడావిడి మామూలుగా ఉండదు. ఏం వండాలి? ఏది వండితే వాళ్ళకి నచ్చుతుంది? అని తెగ ఆలోచించేస్తుంటాం. సాధారణంగా అందరూ చేసే బగారా రైస్ లేదా బిర్యానీ కాకుండా, ఈసారి కొంచెం కొత్తగా, అదే సమయంలో అతి తక్కువ శ్రమతో అదిరిపోయే రుచిని అందించే 'స్పెషల్ రైస్ మరియు గ్రేవీ చికెన్ ఫ్రై' ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది?

Phani CH
|

Updated on: May 03, 2026 | 5:58 PM

Share
ముందుగా ఒక కిలో చికెన్‌ను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇందులో ఉప్పు, కారం, పసుపుతో పాటు వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, మరియు కొద్దిగా మిరియాల పొడి వేయాలి. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా మరియు అరచెక్క నిమ్మరసం కలపాలి.

1 / 5
ముఖ్యంగా ఒక స్పూన్ కసూరి మేతిని వేయించి పొడి చేసి వేస్తే ఆ సువాసన అద్భుతంగా ఉంటుంది. చివరగా అర కప్పు పెరుగు వేసి ముక్కలన్నింటికీ మసాలా పట్టించి అరగంట పాటు నానబెట్టాలి. ఒక కడాయిలో నూనె వేడి చేసి, మ్యారినేట్ చేసిన చికెన్‌ను వేసి హై ఫ్లేమ్‌లో ఐదు నిమిషాలు వేయించాలి. 

2 / 5
ఆ తర్వాత మూత పెట్టి చిన్న మంటపై పది నిమిషాలు ఉడికిస్తే చికెన్ నుండి నీరు ఊరి గ్రేవీ తయారవుతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్ పేస్ట్ (వేయించిన ఉల్లిపాయల ముద్ద) వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. నూనె పైకి తేలే వరకు ఉడికిస్తే ఎంతో రుచికరమైన జ్యూసీ గ్రేవీ చికెన్ ఫ్రై రెడీ!

3 / 5
స్పెషల్ రైస్ తయారీ విధానం: ఈ రైస్ కోసం ముందుగా నాలుగు టమాటాలను ఉడికించి, వాటిని చల్లార్చి మిక్సీలో వేయాలి. అందులోనే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె, నెయ్యి వేసి పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించాలి. మనం గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్‌ను ఇందులో వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి, తగినంత ఉప్పు, కారం, బిర్యానీ మసాలా కలపాలి.

4 / 5
మూడు కప్పుల బాస్మతి బియ్యానికి నాలుగున్నర కప్పుల నీళ్లు పోసి ఎసరు మరగనివ్వాలి. అరగంట నానబెట్టిన బియ్యాన్ని ఇందులో వేసి ఉడికించాలి. అన్నం దగ్గర పడ్డాక, పైన కొద్దిగా ఉల్లిపాయలు వేయించిన నూనెను చల్లి, మూత పెట్టి చిన్న మంటపై దమ్ ఇవ్వాలి. ఒక పది నిమిషాల తర్వాత చూస్తే పొడిపొడిలాడుతూ, టమాటా మరియు మసాలాల ఫ్లేవర్‌తో రైస్ సిద్ధంగా ఉంటుంది.

5 / 5
Follow Us
ఇంతకంటే బెస్ట్ టీమ్ చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అంటూ..

చికెన్, మటన్ కన్నా నాలుగు రెట్లు ఎక్కువ.. తింటే ఎముకలు ఉక్కులా

మహేష్ బాబుకు మాత్రమే నేను విలన్‌గా నటిస్తా..

సినిమాను తలపించిన రియల్ స్టోరీ..14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు

జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు!

వీరి బాధలన్నీ పోగొట్టడానికి వస్తున్న భారీ గ్రహం.. లక్ కలిసి వచ్చే

ఐటీఆర్ ఫైలింగ్‌కు ఈ ట్యాక్స్‌పేయర్స్‌కు ఆగస్టు 31 వరకు గడువు!

ఆర్జీవి ఆ స్టార్ హీరోయిన్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా.?

ధోనీ ట్రైనింగ్.. లంకపై వేటకు సిద్ధమవుతున్న పంత్.. పిక్స్ వైరల్..

జాబిల్లిని ఢీకొట్టనున్న స్పేస్‌ఎక్స్ రాకెట్.. ఆ తర్వాత